ప్రపంచ ప్రళయకారిణిగా మారుతున్న చైనా దురహంకారానికి పలు ఋజువులు: అమెరికా అధికారులు


Pilger’s film reveals a build-up to war on China’s doorstep with US bases in Japan, Korea and hundreds of other places.



చైనా మితిమీరిన  దురహంకారానికి సాక్ష్యం అగ్రరాజ్యం అమెరికాతో కూడా కయ్యానికి బరిలో దిగిన చైనా విమానదళ అకృత్యం వెలుగులోకి వచ్చింది. భారత్‌తో ఇప్పటికే కయ్యానికి కాలుదువ్విన చైనా మరోపక్క, అమెరికాతో కూడ అలాంటి చర్యకే దిగింది. అది మితిమీరిన దురహంకారం తో ఏకంగా అమెరికా నిఘా విమానాన్ని అడ్డుకునే కార్యక్రమానికి  దిగింది.  పూర్తిస్థాయిలో ఆయుధాలతో ఉన్న రెండు చైనా యుద్ధ విమానాలు అమెరికా నిఘా విమానానికి అత్యంత చేరువగా వెళ్లి దానిని అడ్డుకునే ప్రయత్నం చేశాయని అమెరికా అధి కారులు చెప్పారు. ఒకవేళ ఖర్మకాలి ఏమాత్రం తప్పు జరిగినా ప్రపంచం విలపించే పరిస్థితి అది. అంటే ప్రపంచం నాశనమైనా తన సామ్రాజ్యవాదం కోసం చైనా ఎందాకైనా వెళ్ళే సూచనలున్నాయని పిస్తుంది.


తూర్పు చైనా సముద్రంపై ఎగురుతున్న తమ నావికాదళ నిఘా విమానం "యూఎస్‌ ఈపీ-3" కి చైనాకు చెందిన  "జే 10" రకానికి చెందిన పలు విమానాలు అత్యంత సమీపం గా వచ్చాయని, దీంతో తమ విమాన ప్రయాణ మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. దక్షిణ చైనా సముద్రంపై తమ పెత్తనం కొన్సాగించే ప్రయత్నాలు కొన సాగిస్తూనే ఇటు తూర్పు చైనా సముద్రం పై పట్టు కోరే చైనాకు భారత సార్వభౌమత్వమే కాదు అమెరికా సార్వభౌమత్వం కూడా అలక్ష్యమే? అంతే కాదు ఒక ప్రక్క టిబెట్ ను మింగేసిన డ్రాగన్ తాజాగా భూటాన్ను మింగేసి ఆ తరవాత భారత్ పై పడాలని చూసే చైనాకు సరైన సమాధానం ప్రపంచ దేశాలే చెప్పాలి. ప్రపంచ విలయానికి చైనా పన్నే పన్నాగాలు చివరకి దాని పుట్టి మునిగే  ముంచే ప్రమాదాలు దాపురించవచ్చు.  ఆ సమయంలో చైనా యుద్ధ విమానంలో భారీ స్థాయిలో అనేక ప్రమాధకర పేలుడు పదార్థాలు ఉన్నాయని, అది మరింత దగ్గరగా వచ్చి ఉంటే ఏదైనా ప్రమాదం జరిగి ఉండేదని పెంటగాన్‌ అధికారులు తెలిపారు. 




దానికి చైనా అలక్ష్య నిర్లక్య సమాధానంగా,  "అప్పుడప్పుడు ఇలా జరగడం సాధారణం అని, ఉద్దేశపూర్వకంగా చేసిన చర్య కాదని"  చైనా ప్రతినిధులు తెలిపారు. అయితే, కేవలం 300 అడుగుల సమీపంలోకి చైనా విమానం రావడం తమను ఆలోచన లో పడేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇది తమకు తొలి అనుభవం కాదని గతంలో కూడా రెండు సార్లు చైనాకు చెందిన "ఎస్‌యూ-30" యుద్ధ విమానాలు ఇలాగే తమ విమానం విషయంలో జోక్యం చేసుకున్నట్లు వారు చెబుతున్నారు. 
దీన్ని బట్టి చైనా భారత్ కే కాదు ప్రపంచానికే ప్రళయ కారిణిగా మారిందని భావించవలసి వస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: