ఆమెరికా అధ్య‌క్షుడి కూతురు హైద‌రాబాద్‌కి...!

DSP
అగ్ర‌రాజ్యమైన అమెరికా అధ్య‌క్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్ర‌ప్ త్వ‌ ర‌లో హైద‌రాబాద్‌లో అడుగు పెట్ట‌నుంది.  హైద‌రాబాద్ లో న‌వంబ‌ర్ 28న జ‌ర‌గబోయే అంత‌ర్జాతీయ పెట్టుబడిదారుల స‌ద‌స్సు (గ్లోబ‌ల్ ఎంత్రప్రెన్యూర్‌షిఫ్‌) కు ఆమె రానున్న‌ట్లు స్వ‌యంగా డొనాల్డ్ ట్రంప్ త‌న ట్విట‌ర్‌లో సందేశాన్ని ఇచ్చారు. ఆమెరికా ప్ర‌తినిధుల బృందానికి ఇవాంకా ట్రంప్ నేతృత్వం వ‌హిస్తుందని తెలిపారు.


నీతి ఆయోగ్‌, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వ‌రంలో జ‌రుగ‌నున్న ఈ సద‌స్సులో ప్రధాని మోడీ కూడా పాల్గొంటారు.  ఈ నేప‌థ్యంలో , ‘భారత్‌లో  నేపథ్యంలో, ‘భారత్‌లో జరిగే జీఈఎ్‌స-2017కు అమెరికా ప్రతినిధుల బృందానికి సారథ్యం వహించనుండడం, ప్రధాని మోదీని, ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలను కలుసుకోనుండడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను’ అని ఇవాంకా ట్విటర్‌లో పేర్కొన్నారు. 

ప్రధాని మోదీతో తాను కరచాలనం చేస్తున్న చిత్రాన్ని కూడా ఆమె తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  ‘ఈ సదస్సు ప్రపంచంలోని పారిశ్రామికవేత్తలందరినీ ఒక్క చోటికి చేర్చే గొప్ప వేదిక’ అని  ప్రధాని  రీట్విట్ చేశారు. 35 ఏళ్ల ఇవాంకా తన తండ్రికి సలహాదారుగా ఉన్నారు. మహిళలు, చిన్నారులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: