సేఫ్ గేమ్ ఆడిన పవన్ కల్యాణ్..! ఎందుకో తెలుసా..?

Vasishta

          జనసేన అధినేత పవన్ కల్యాణ్ నంద్యాల ఉపఎన్నికల, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకీ మద్దతివ్వడంలేదని తేల్చేశారు. పవన్ కల్యాణ్ ప్రకటన జనసేన శ్రేణులకు ఉత్సాహం కలిగించినా, టీడీపీకి మాత్రం నిరాశనే మిగిల్చింది. జనసేన మద్దతు ఎప్పుడైనా తమకే ఉంటుందని భావిస్తూ వస్తున్న టీడీపీ శ్రేణులకు పవన్ ప్రకటన ఆశ్చర్యమే.! అయితే పవన్ మాత్రం సరైన నిర్ణయమే తీసుకున్నట్లు క్లియర్ గా అర్థమవుతోంది.


          పవన్ కల్యాణ్ కు రాజకీయ అనుభవం లేదు. జనసేనకు క్షేత్రస్థాయి పార్టీ నిర్మాణం లేదు. కానీ ఆయనపై విపరీతమైన అభిమానం ఉంది. ఆయన పిలుపుకోసం అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో నంద్యాల ఉపఎన్నిక జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఎవరికి మద్దతిస్తారోనని ఎదురుచూసిన వారికి పవన్ పిచ్చ క్లారిటీ ఇచ్చేశారు.


          వాస్తవానికి పవన్ నిర్ణయం చాలా కీలకం. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో బలిజలు పాతికవేలకు పైగా ఉన్నారు. పవన్ మద్దతిస్తే వారి ఓట్లన్నీ తమకే పడతాయని టీడీపీ భావిస్తూ వచ్చింది. అయితే పవన్ మాత్రం ఎవరికీ మద్దతివ్వట్లేదని తేల్చేశారు. ఒకవేళ టీడీపీకి మద్దతిచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. బహుశా బలిజలు ఆ పార్టీకి ఓటేశారనే అనుకుందా.. అనుకోకుండా టీడీపీ ఓడిపోతే అది జనసేనకు కూడా పరాభవం లాంటిదే.! అప్పుడు జనసేన మద్దతిచ్చినా గెలవలేదని, టీడీపీ –జనసేనల పనైపోయిందని వైసీపీ ప్రచారం చేస్తుంది.


          ఇక కాకినాడ కార్పొరేషన్ లో కాపుల ఓట్లే కీలకం. అయినా పవన్ ఏ పార్టీకీ మద్దతు లేదని తేల్చేశారు. కాపుల ఓట్లే కీలకం కాబట్టి అక్కడ గెలుపోటములు ఎలాగైనా ఉండొచ్చు. అందుకే అక్కడ కూడా ఎలాంటి ఛాన్స్ తీసుకోకూడదని భావించిన పవన్ కల్యాణ్ చాలా సేఫ్ గేమ్ ఆడారు. చాలా పరిణతి చెందిన రాజకీయ నాయకుడిలా నిర్ణయం తీసుకున్నారు. ఇది జనసేనకు మేలు చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: