అఖిల ప్రియకు షాక్ ఇచ్చిన బాబు..?!

Edari Rama Krishna
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఎటు నుంచి ఎటు మలుపు తిరుగుతున్నాయో అస్సలు అర్ధం కావడం లేదు.  తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత అటు ఏపి..ఇటు తెలంగాణలో కాంగ్రెస్ దాదాపు భూ స్థాపితం అయినట్లే ఉంది.  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టిడిపి, వైసీపీ ల మద్య వైరం కొనసాగుతుంది.  ఆ మద్య వైసీపీ తరుపున గెలుపొందిన కొంత మంది నేతలు టీడిపి లోకి జంప్ అవుతూ వచ్చారు.  ఈ క్రమంలో వైఎస్ కి ఎంతో నమ్మకంగా ఉంటూ వచ్చిన భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.  

ఇప్పుడు నంద్యాలలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి..ఈ మేరకు ఇరు పార్టీ వర్గాలు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నాయి.  నిన్న నంద్యాలలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రోడ్ షో నిర్వహించారు.  గత వారం రోజుల నుంచి అక్కడే తిష్ట వేశారు వైసీపీ నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.  తాజాగా ఇప్పుడు నంద్యాలలో మరో ట్విస్ట్ నెలకొంది..ఇప్పటి వరకు వైసీపీ నేతగా కొనసాగుతున్న మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమైపోవడంతో.. ఎన్నికల వేళ వైసీపీకి అనూహ్య షాక్ తగిలినట్లయింది.

వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్‌ను ప్రతాప్ రెడ్డికి చంద్రబాబు ఆఫర్ చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.  అయితే ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డికి ఎంత వరకు ఇబ్బంది కలిగిస్తుందో తెలియదు కానీ..  అఖిలప్రియనే ఇబ్బంది పెడుతోందన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే..గత కొంత కాలంగా సీమలో భూమ వర్సెస్ గంగల గొడవలు తారా స్థాయికి చెరుకున్న విషయం తెలిసిందే.  నంద్యాల ఉపఎన్నికలో అధినేత చంద్రబాబు తమను పట్టించుకోవడం లేదన్న అసంతృప్తిలో ఉన్న అఖిలప్రియకు ఇప్పుడీ విషయం ఏమాత్రం మింగుడుపడటం లేదని ప్రచారం సాగుతోంది.

 అంతే కాదు ఈ విషయం తనకు ఏమాత్రం తెలియకుండా తన పని తాను చేసుకు పోతున్న చంద్రబాబు విషయంలో అఖిలప్రియ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆళ్లగడ్డలో తొలి నుంచి భూమా వర్గానికి వ్యతిరేకంగా ఉన్న గంగుల ప్రతాప్ రెడ్డి వర్గాన్ని పార్టీలో చేర్చుకోవడం అఖిలప్రియకు మింగుడుపడటం లేదట. మున్ముందు వీరంతా కలిసి తన స్థానానికి ఎక్కడ చెక్ పెడుతారోనన్న ఆందోళనలో ఆమె ఉన్నట్లు ప్రత్యర్థి వర్గం చెబుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: