శిల్పా ఇంటిని పీకి.. గంగుల ఇంటికి పందిరి.! చంద్రబాబు సూపర్ ప్లాన్..!!

Vasishta

          శిల్పా ఇంటిని పీకడమేంటి.. గంగుల ఇంటికి పందిరి వేయడమేంటి.. అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో శిల్పా కుటుంబాన్ని చంద్రబాబు దూరం చేసుకున్నారు. ఆ స్థానాన్ని ఇప్పుడు గంగుల ప్రతాపరెడ్డితో భర్తీ చేయబోతున్నారు. ఇంకా అర్థం కాలేదా..? చక్రపాణి రెడ్డి రిజైన్ చేయడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని గంగుల ప్రతాపరెడ్డికి ఇవ్వబోతున్నారు.


          ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనేది సామెత. చంద్రబాబు ఇప్పుడు ఇదే పని చేయబోతున్నారు. కర్నూలు జిల్లాలో ఖాళీ అయిన ఓ ఎమ్మెల్సీ స్థానాన్ని ఆ జిల్లా వాసులకే ఇచ్చి రుణం తీర్చుకోవాలనుకున్నట్టున్నారు. శిల్పా కుటుంబానికి నంద్యాల సీటు ఇవ్వకపోవడంతో బ్రదర్స్ ఇద్దరూ టీడీపీకి రిజైన్ చేసి వైసీపీకి వెళ్లిపోయారు. చక్రపాణిరెడ్డి ఏకంగా తన ఎమ్మెల్సీ సీటుకు రిజైన్ చేసి వెళ్లిపోయారు.


          చక్రపాణిరెడ్డి కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి. నంద్యాల, శ్రీశైలం నియోజకవర్గాల్లో మంచి పట్టున్న నేత. భూమా నాగిరెడ్డి ఉంటే టీడీపీకి మంచి పట్టు ఉండేది. అయితే ఆయన లేకపోవడంతో వారసులపై భారం పడింది. వాళ్లు పిల్లలు కావడంతో రాజకీయ అనుభవం తక్కువ. అందుకే శిల్పా సోదరులకు గట్టిపోటీ ఇచ్చే వ్యక్తికోసం చంద్రబాబు వెతికారు. ఇంతలో వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు గంగుల రూపంలో మంచి పట్టున్న నేత దొరికారు.


          గంగుల ప్రతాపరెడ్డి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల్లో మంచి బలగం కలిగిన నేత. గంగుల సోదరుడు ప్రభాకర్ రెడ్డి ఇటీవలే వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు గంగుల ప్రతాపరెడ్డి కూడా ఎమ్మెల్సీ అవకాశం చేజిక్కించుకున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి ద్వారా ఖాళీ అయిన స్థానాన్ని ప్రతాపరెడ్డికి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని తెలుస్తోంది. ఇందుకు ప్రతాపరెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం.


          ప్రస్తుతానికి ఎమ్మెల్సీ స్థానం ద్వారా గంగుల ప్రతాపరెడ్డిని సర్దుబాటు చేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి సిచ్యుయేషన్ ఎలా ఉంటుందోననే ఉత్కంఠ నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: