స్వర్గీయ భూమా నాగిరెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ..!

ప్రతిపక్షనేత శ్రీ జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు "పైన దేవుడు ఉన్నాడు" అనే పదాన్ని అనేకసార్లు ఉచ్చరించడం మనం విన్నాం. సరిగ్గా మూడేళ్ల క్రితం 23 - 8 - 2014న " ఆంధ్రజ్యోతి" అధినేత వేమూరి రాధాకృష్ణ స్వర్గీయ భూమా నాగిరెడ్డిని ఇంటర్వ్యూ చేశారు. దానిని యధాతథంగా మరుసటిరోజు అంటే ఆగస్టు 24వ తేదీన " ఆంధ్రజ్యోతి" దినపత్రికలో ప్రచురితమైనది. ఆ ఐటమ్ ను యధాతథంగా మనకోసమే కాదు విజ్ఞులైన నంద్యాల ఓటర్లకోసం పునఃప్రచురణ గావిస్తున్నాను. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని వారికి విన్నపం 
 
ప్ర. శోభా గారి జ్ఞాపకాల నుండి బయటపడ్డారా?


జ.ఇంకా ఆ జ్ఞాపకాల్లోనే ఉన్నాను. ఎందుకంటే ఆమె స్నేహితురాలి కన్నా ఎక్కువ.

ప్ర.  మీది ప్రేమ పెళ్లా?


జ. బాధ్యతతోకూడిన ప్రేమ వివాహం. 
 

ప్ర.రాజకీయాల్లో లాలూచీలు ఎక్కువయ్యాయి!.. మరి మీ కుటుంబం...గంగుల కుటుంబం కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా?


జ. మాదివేరు ఇప్పుడు మీరు నాకు నచ్చారనుకోండి. మీ ప్రత్యర్థులను కూడా నా ప్రత్యర్ధులుగా భావిస్తాను. చంద్రబాబు మీద అభిమానంతో వైఎస్ ను పలకరించే వాడ్ని కాదు.


ప్ర. మరి పీఆర్పీ లో చేరారు కదా?

జ.చంద్రబాబుకు చాలా లాయల్ గా ఉండేవాణ్ణి. విపరీతంగా నమ్మేవారిని ఆయన ఎందుకు నమ్మరో అర్ధం కాదు....


ప్ర.అయినా మీరు కోవర్టులని అన్నారెందుకు?

జ.చిరంజీవికి రాజకీయాలేమీ తెలియదు. అది మేము వెళ్ళాక తెలిసింది. ఆయనకు సీరియస్ నెస్ లేకపోవటంతో కాంగ్రెసుతో విలీనం అయితే మంచిదని చెప్పాను. అంతదాకా వైఎస్ తో  మాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన చనిపోయిన తరువాతే జగన్ ని చూశాను. ఆ తరువాత మెల్లగా జగన్ వెంట నడిచాం.


ప్ర. వైసీపీకి విపరీతమైన హైప్ వచ్చింది కానీ చివర మూడు నెలల్లో పోయింది ఎందుకు?

జ.హామీలపై జగన్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. రుణమాఫీని లక్షవరకైనా ప్రకటించండి అని నేనూ, శోభ చెప్పాం. చివరి నిమిషం వరకు ఫోన్లో శోభ చెప్పింది. అది సాధ్యం కాదు ఒక్కసారి హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే భవిష్యత్తులో దాని ప్రభావం విపరీతంగా ఉంటుంది అని జగన్ అన్నారు.

ప్ర. డబ్బులు తీసుకుని టిక్కెట్లు ఇచ్చారని ప్రచారం జరిగింది?

జ.ఆలా ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. డబ్బు విషయం ఎప్పుడూ జగన్ దగ్గర ప్రస్తావన రాలేదు. నేను దగ్గరనుండి చూశాను. ఆయన ఓ డిఫరెంట్ రాజకీయ నాయకుడు.

ప్ర. మనుషులకు గౌరవం ఇవ్వడని, ఓ అపరిచితుడని చాలా మంది అన్నారు?

జ.అది మీడియా ప్రచారమే. ఎవరినైనా అన్నా అని పలకరిస్తారు. నేను రోజూ వెళ్తాను మరి పలకరించాల్సిన అవసరమేంటి?....

 ప్ర. వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని నమ్మకం ఉందా? ఆయనపై కేసులు ఉన్నాయి కదా?

జ.ఆ కేసులు ఎంత మంది కలిస్తే వచ్చాయో మనకు తెలిసిందే. ఏ స్థాయికి తీసుకొచ్చారో క్లియర్ గాఉంది. చంద్రబాబు పైనా కేసులున్నాయి అది జనానికి తెలియదు. స్టే లు తెచ్చుకొని విచారణ నిల్పివేయించుకున్నాడు. భగవంతుడూ అన్యాయమే చేశాడు.... 

(ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఈ ఇంటర్వ్యూలో ఒక్క కల్పిత పదాన్ని చూపించగలిగినా ఏ శిక్షకైనా బద్ధుడను. ఆన్లైన్లో చెక్ చేసుకొని నన్ను ఛాలెంజ్ చేయవచ్చు అని సవాలు చేస్తున్నాను)

విజ్ఞప్తి
 
నిజాలు నిలకడ మీద తెలుస్తాయి అంటారు. ఆలోచించండి. న్యాయాన్ని గెలిపించండి. ధర్మాన్ని రక్షించండి, అది మనల్ని కాపాడుతుంది. లేకపోతే మన భవిషత్తు అంధకారంలోకి వెళ్తుంది. ఒక జగన్మోహన్ రెడ్డి,లేక ఒక రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపడలేదు. ఓటు అనే ఆయుధంతో ప్రజలే నిర్ణయించుకోవాలి. విలువల్ని కాపాడుకోవాలి. సత్యాన్ని నిలబెట్టే సత్తాను చాటాలి. ఎవరి దుర్మార్గపు చర్యల వలన ఉపఎన్నిక అవసరం అయిందో ప్రజలు వివేకంతో, విజ్ఞతతో ప్రలోభాలకు లొంగకుండా సరిఅయిన నిర్ణయం తీసుకోవాలని ప్రార్ధన..
మీ
మాదిరెడ్డి శ్రీనివాస రెడ్డి,
అధ్యాపకుడు,గుంటూరు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: