డబ్బు ఏరులై పారుతుంది..నంద్యాల ఎలక్షన్స్ వాయిదా పడుతాయా..!?

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో  ఇప్పుడు ఎక్కడ చూసినా నంద్యాల ఎలక్షన్స్ గురించే టాక్ నడుస్తుంది.  గెలుపు కోసం అధికారం పక్షం..ప్రతిపక్షం మద్య పెద్ద యుద్దమే కొనసాగుతుంది. ఇప్పటి వరకు నంద్యాల లో టిడిపి, వైసీపీ నాయకులు రోడ్ షో లో హోరా హోరీ ప్రచారం నిర్వహించారు.  అంతే కాదు నంద్యాల ఓటరు కి డబ్బు, మద్యం, ఇతర బహుమతులతో ప్రలోభ పెడుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.  

ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి ఎలాంటి ఆర్భాటాలు, హంగామా కనిపించలేదు. కాగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నంద్యాలలో తమ ఉనికి కాపాడుకోవడానికి పథకం పన్నినట్లు కనిపిస్తుంది.  ఈ ఎన్నికలో ప్రధాన పార్టీలు విచ్చలవిడిగా  ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.  

గతంలో తమిళనాడులో జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కె నగర్ లో ఉప ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే వర్గం వారు విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నారని..ఇక దినకరణ్ ఈసికి డబ్బులు ఎర చూపినట్లు కేసు కూడా నమోదైంది.  నంద్యాల లో కూడా ఇదే రీతిన డబ్బు పంపిణీ విచ్చలవిడిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో  నంద్యాలలో ఉప ఎన్నికలు ఆపివేయాలని  ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, పార్టీ సీనియర్ నేతలు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జేడీ శీలం తదితరులు కర్నూలు రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద కొద్దిసేపు ప్రదర్శన నిర్వహించి, ఆ తరువాత ఆయనకు వినతిపత్రం అందజేశారు.  

మొన్నామద్య వైసీపీ వర్గం ఫిర్వాదు మేరకు   గాజులపల్లి వద్ద ఓ కంటెయినర్‌ని ఎన్నికల నిఘా విభాగం పట్టుకుని పోలీసులకు అప్పగించిన విషయం గమనార్హం.  ఈ నేపథ్యంలో నంద్యాల ఎన్నిక చివరి క్షణంలో వాయిదా పడినా పడవచ్చుననే ఊహాగానాలు రేగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: