నంద్యాలలో 11 గంటల తర్వాత ఏమైనా జరగబోతోందా..?

Vasishta

        నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు పెద్దఎత్తున బారులు తీరి ఓటుహక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఓటుహక్కు వినియోగించుకున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం చేసిన వ్యాఖ్యలు అందరినీ ఉత్కంఠకు గురిచేశాయి.   


        ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం శిల్పా మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాస్త ఆందోళన కలిగించాయి. ఇప్పటికైతే ఓటింగ్ ప్రశాంతంగా సాగుతోందని.. అయితే 11 గంటల తర్వాత అప్రమత్తంగా ఉండాలని ఆయన తమ శ్రేణులకు సూచించారు. అధికారపార్టీ గొడవలకు పాల్పడి ఎన్నిక రద్దు చేసేందుకు ప్రయత్నిస్తోందనే సమాచారం తమకుందని శిల్పా అన్నారు.


        శిల్పా వ్యాఖ్యలు అధికారపార్టీవాల్లనే కాక వైసీపీ శ్రేణులను కూడా కలవరపెట్టాయి. దీంతో రెండు పార్టీలకు చెందిన నేతలు అప్రమత్తమయ్యారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, ఓటర్లు ఎలాంటి భయం లేకుండా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: