యాభై శాతం పోలింగ్ అప్పుడే పూర్తి .. ఇవాళ మొత్తం మీద ఎనభై శాతం అవ్వచ్చు అంటున్న ఈసీ .

KSK

ఎప్పటి నుంచో రసవత్తరంగా సాగిన నంద్యాల ఉప ఎన్నిక ముగింపు ఘట్టానికి చేరుకుంది. నెలల తరబడి చిన్న నాయకులూ వారాల తరబడి పెద్ద నాయకులూ రోజుల తరబడి చంద్రబాబు ,జగన్ లు ప్రచారం చేసిన నంద్యాల లో ఇవాళ ఎన్నిక చాలా ప్రశాంతంగా జరుగుతోంది.


అన్నిటికంటే హై లైట్ ఏంటి అంటి ప్రజా చైతన్యం వైపు ఇవాళ రాజకీయం సాగింది. ఉదయం నుంచే అన్ని పోలింగ్ బూత్ ల దగ్గరా ప్రజలు ఎక్కువగా సందడి చేస్తూ కనపడ్డారు . ఓటింగ్ మొదలైన నాలుగు గంటలకే యాభై శాతం పైగా ఓటింగ్ పూర్తి అవ్వడం విశేషం.


ఈ ఓటర్ల ఉత్సాహం చూస్తూ ఉంటె ఎనభై శాతం వరకూ పోలింగ్ వెళ్ళేలా కనిపిస్తోంది. ఇంత భారీ సంఖ్య లో ఓటర్లని చూస్తున్న ప్రతీ పార్టీ తమకే మెజారిటీ అంటూ ఉన్నారు.


 నంద్యాల పట్టణంలోనే పోలింగ్ కొంత మందకొడిగా సాగుతుండగా, నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో ఓటింగ్ మధ్యాహ్నానికే పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు ఇంతవరకూ చోటు చేసుకోలేదు. కొన్ని ప్రాంతాలలో ఇంకా ప్రచారం సాగుతోంది అని వైకాపా టీడీపీ ఒకరి మీద ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: