ఎన్నికల బూతుల వద్ద భూమా కుటుంబ సభ్యుల హల్ చల్: వైసిపి

2019 సాధారణ ఎన్నికల మహా సంగ్రామానికి నాంది మరియు ప్రస్థావన కాబోతున్న నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం నేతల ప్రచార పటాటోప ప్రలోభాల పర్వం ఎదురులేకుండా యథేచ్ఛగా కొనసాగుతున్నట్లు సమాచారం. "పోలింగ్‌ డే" నాడే టీడీపీ నేతలు నంద్యాల ఓటర్లను బహుముఖంగా ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వారిని భయపెట్టి, బుజ్జగించి మభ్యపెట్టి తమకు అనుకూలంగా ఓటు వేయించుకునే లక్ష్యంగా ఆపసోపాలు పడుతున్నారు. ఈ ప్రలోభాల పర్వం లో భాగంగా గాంధీనగర్‌లో ఆ నేతలు ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తున్నట్టు సమాచారం. 





ఇక తెలుగుదేశం యువ మంత్రి భూమా అఖిలప్రియ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దాన్ని నట్టేట్లో ముంచేరీతిలో వ్యవహరిస్తున్నారు. పోలింగ్‌ రోజునే ఆమె వార్డు ల్లో తిరుగుతూ ఎన్నికల ప్రచారం నియమావళికి విరుద్ధంగా నిర్వహిస్తుండటం జనం గమనిస్తున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం నంద్యాలలో ఇవాళ ఎవరూ ఎన్నికల ప్రచారం చేయకూడదు. కానీ నిబంధనలను నిట్టనిలువున ఉల్లంఘిస్తూ నంద్యాలలో భూమా అఖిలప్రియ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని వాహనాలకు నంబర్‌ ప్లేట్లు కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 




 అలాగే పట్టణంలోని మిట్నాలలో భూమా నాగిరెడ్డి తనయుడు విఖ్యాత్‌ రెడ్డి హల్‌చల్‌ చేస్తూ కనిపించినట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. పోలింగ్‌ జరగుతుండగా కేంద్రాల్లోకి వెళ్లిన విఖ్యాత్‌ ఎన్నికల నిబంధనలను సమూలంగా ఉల్లంఘించారు. ఈ ఘటనపై స్పందించిన శిల్పా మోహన్‌ రెడ్డి తనయుడు రవిచంద్ర కిషోర్‌ రెడ్డి, అధికార పార్టీ బెదిరింపులకు ఎవరూ భయ పడొద్దని ప్రకటించారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలని కోరారు. మహిళలు భారీ ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనడం సంతోషదాయకమని అన్నారు. 





అలాగే భూమా మౌనికారెడ్డి దివంగత నేత భూమా నాగిరెడ్డి కుమార్తె, తండ్రి లేని లోటు తీరుస్తు గతంలో భూమా నాగిరెడ్డి లాగానే నిబంధనలను నిట్టనిలువున ఉల్లంఘిస్తూ  పర్యవేక్షించేవారు. ఫ్యాక్షన్ పడగ విప్పే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే నేపం తో ఆమె ప్రచార పర్వం యధావిధిగా నడిపిస్తున్నారని సమాచారం. కాగా డమ్మీ అభ్యర్థిగా భూమా మౌనిక నామినేషన్ వేశారు. అయితే నామినేషన్ పత్రాలు సరిగ్గా లేక పోవడంతో ఈసీ తిరస్కరించింది. మధ్యాహ్నం నుంచి ప్రత్యర్థులు గొడవలు సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌‌రెడ్డి మీడియాకు వివరించిన విషయం తెలిసిందే. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా బూత్‌‌లలో రిగ్గింగ్, గొడవలు జరుగుతాయని అభ్యర్థుల కుటుంబీకులు ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మరీ పరిశీలిస్తున్నారు.



 


నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్‌ నేపథ్యంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడం దారుణమని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. సీఎం నుంచే అధికారులకు ఆదేశాలు వెళ్లడంపై ఎన్నికల సంఘం విచారణ జరపాలని ఆమె డిమాండ్‌ చేశారు. వాసిరెడ్డి పద్మ బుధవారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. "మంత్రులు కంట్రోల్‌ రూమ్‌లో ఉండి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ఏంటి?. ఇతర నియోజకవర్గాల ఎమ‍్మెల్యేలు నంద్యాలలో ఎందుకు తిరుగుతున్నారు?. అంతా సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది" అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్‌ఆర్‌ సీపీ విజయాన్ని ఆపలేరు అని పద్మ ఉద్ఘాటించారు.




ఎన్నికల సరళిని పరిశీలిస్తే 10 గంటల సమయం వరకే 30% ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుందని, పోలీసులు అధికార పక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్న సందర్భానికి సవాల్ గా ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఓటింగ్ లో పాల్గొని ప్రజా స్వామ్యానికి ఎదురులేదని నిరూపించాలని అన్నారు పోలీసులు గత రాత్రి శిల్పా మోహన్‌ రెడ్డి ఏజెంట్ల విషయంలో దుర్మార్గంగా వ్యవహరించారని. ఆధార్‌ కార్డు చూపించినా శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాల నుంచి పంపాలని చూశారు. ఎన్నికల సమయంలో సీఎం ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏంటి?  ముఖ్యమంత్రికి ఎన్నికల నియమావళి తెలియదా? ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారు. పోలింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ మరింత శ్రద్ధ పెట్టాలి.’ అని ఆమె విజ్ఞప్తి చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: