షేమ్ : తెలుగు విద్యార్థులపై విషంగక్కిన కన్నడిగులు..!

Vasishta

          ప్రపంచంలో జాతి, ప్రాంత విద్వేషాలు కొత్త కాదు. పురాతన కాలం నుంచి ఇలాంటి ఎన్నో ఘటనలను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మన పక్కనే ప్రాంతీయ విద్వేషం రచ్చకెక్కింది. కర్నాటకలో పరీక్ష రాయడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడి విద్యార్థులు, సంఘాలు అడ్డుకున్నాయి. దీంతో పరీక్ష రాయలేకపోయారు తెలుగు స్టూడెంట్స్.


          కర్నాటక, తమిళనాడు మధ్య ప్రాంతీయ విద్వేషాలు ఎంతోకాలంగా ఉన్నాయి. అయితే కర్నాటక – ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ మధ్య ఎప్పుడూ లేవు. కన్నడిగులు, తెలుగువాళ్లు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ తొలిసారి బెంగళూరు, హుబ్లి తదితర ప్రాంతాల్లో తెలుగువారిపై కన్నడ సంఘాలు విషం గక్కాయి. బ్యాంకింగ్ పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్థులను పరీక్ష రాయనీయకుండా గేటు బయటే ఆపేశారు.


          వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ పరీక్షలు రాస్తున్నందున తమ ఉద్యోగావకాశాలు కోల్పోతున్నామనేది వారి భయం. అందుకే తెలుగువాళ్లను అడ్డుకున్నారు. ఇక్కడికొచ్చి పరీక్ష రాసేందుకు అంగీకరించబోమంటూ వారం రోజుల ముందు నుంచే విద్యార్థులకు పలువురు ఫోన్లు చేసి బెదిరించినట్టు తెలుస్తోంది. 9,10 16,17 24 తేదీల్లో కర్నాటకలోని పలు కేంద్రాల్లో బ్యాంకింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. వాటిని రాసేందుకు పలువురు తెలుగు విద్యార్థులు అప్లై చేసుకున్నారు.


          వాస్తవానికి బ్యాంకింగ్ పరీక్షలకు ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉంది. ఇవేవీ ప్రాంతీయ పోస్టులు కాదు. 2010 వరకూ కర్నాటకలో భర్తీ చేసే బ్యాంక్ పరీక్షలను కర్నాటకవాసులు మాత్రమే రాయాలనే నిబంధన ఉండేది. ఇప్పుడా నిబంధన లేదు. అందుకే తెలుగు వాళ్లనే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్లు కూడా ఎక్కడికైనా వెళ్లి పరీక్షలు రాస్తుంటారు. అయితే కర్నాటక వెళ్లి పరీక్ష రాసేవాళ్లలో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉంటున్నారు. దీన్ని అక్కడి విద్యార్థులు, సంఘాలు సహించలేకపోతున్నాయి.


          తెలుగు విద్యార్థులను అడ్డుకోవడంపై ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు తీవ్రంగా స్పందించాయి. వెంటనే ఈ విషయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిందిగా చీఫ్ సెక్రటరీలను ముఖ్యమంత్రులు ఆదేశించారు. ఈ వివాదం ముదురుతోందని గ్రహించిన బ్యాంకింగ్ యాజమాన్యాలు ఇవాల్టి పరీక్షను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాయి. కనీసం ఇకపై జరిగే పరీక్షలకైనా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: