భారత్ పరువు దిగజార్చిన అమెరికా ట్రంప్

బహమాస్‌, బెలిజ్‌, బొలివియా, కొలంబియా, కాస్తారికా, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వేడార్‌ ఈఐ సాల్వడార్‌, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్‌, జమైకా, లావోస్‌, మెక్సికో, నైకాగువా, పనామా, పెరూ, వెనెజులా డేశాల పేర్లు మనం వింటూనే ఉన్నాం కదా! అయితే ఇక నుండి మనదేశం పేరు వీటి పక్కన కలుపుకుని చదువు కోవలసి వస్తుంది. ఎందుకంటే శ్రీమాన్ డొనాల్డ్ ట్రంప్ మనదేశం పేరును ఇటువంటి దేశాల సరసన చేరుస్తూ ప్రకటించారు. అయినా ఏంచేస్తాం? అసలే ఒకరకమైన దురహంకారం ఉన్న ఈయనకు అమెరికా లాంటి అగ్రరాజ్యం అధ్యక్ష పదవికట్టబెట్టింది. ఇంకేం మనోడి పిచ్చికి అధికారం అనే రాయి చేతికి చిక్కింది. అయనేం చేపితే అదే. ప్రస్తుతానికి భరిద్ధాం. అసలు కథేమంటే:





అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇండియాను "అక్రమంగా మత్తుపదార్థాలను ఉత్పత్తి చేస్తున్న దేశం" గా ప్రకటిస్తూ దేశాన్ని అలాంటి దేశాల వరుసలో చేర్చారు. మొత్తం 21 దేశాలు మత్తు పదార్థాల ఉత్పత్తి చేసే దేశాలుగా, రవాణా చేసే దేశాలుగా ప్రకటించారు. ఈ దేశాల్లో "పాకిస్థాన్‌, అప్ఘనిస్థాన్‌లు ఎక్కువగా డ్రగ్స్‌ ఉత్పత్తి చేసి పంపిణీ దేశాలు" గా ఆయన పేర్కొన్నారు. భారత్‌తో పోలిస్తే మిగితా దేశాలు అత్యధికంగా డ్రగ్స్‌ సమస్యను ఎదుర్కొంటున్నాయని తెలిపుతూ మన దేశానికి కొంత వెసులుబాటు ఇచ్చారు.



Poppy to Heroin - Taliban move into Afghanistan Drug Production


బహమాస్‌, బెలిజ్‌, బొలివియా, కొలంబియా, కాస్తారికా, డొమినికన్‌ రిపబ్లిక్‌, ఈక్వేడార్‌ ఈఐ సాల్వడార్‌, గ్వాటెమాలా, హైతీ, హోండురాస్‌, జమైకా, లావోస్‌, మెక్సికో, నైకాగువా, పనామా, పెరూ, వెనెజులావంటి దేశాల సరసన భారత్‌ను కూడా ఆయన ప్రకటిస్తూ,  భౌగోళిక స్వరూపం, వాణిజ్య వ్యవహారాలు, ఆర్థిక వ్యవస్థ ప్రభావాలు వంటివి ఈ దేశాల్లో డ్రగ్స్‌ ఉత్పత్తి కైనా, రవాణా చేయడానికైనా అనుకూలంగా ఉన్నాయని, ఆ కారణంగానే ఈ దేశాలను ఆ జాబితాలో చేర్చినట్లు తెలిపారు. 


గత పన్నెండు నెలలుగా బొలివియా, వెనెజులా దేశాలు డ్రగ్స్‌ నివారణలో పూర్తిగా విఫలమయ్యాయని చెప్పారు. గత ఏడాదిగా కొలంబియాలో మత్తు పదార్థాలకు అవసరమైన పంటలను సాగు చేయడం అధికం అయిందని దాని విషయంలో తీవ్రంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు ఆ లిస్ట్ లో ఉన్న అన్నీ దేశాలతో పాటు మనలను హెచ్చరించరు. తస్మాత్ మనం జాగ్రత్తగా ఉండాలన్న మాట! 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: