భారత్ ను నిన్నొదల బొమ్మాళీ! అంటూ నేపాల్ ద్వారా సవాల్ చేస్తున్న చైనా

భారత్ సమర్ధత ప్రదర్శించటంతో చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా చివరకు దౌత్య మార్గం ద్వారా డోక్లాం సమస్యను పరిష్కరించుకుని బయటపడింది. అయితే కుక్క తోక వంకర అన్నట్లు దాని సహజ గుణం మానలేక పోతుంది. ఇంకోసారి తన వంకర బుద్ధిని బయటపెట్టుకుంది. భారత్‌ సమర్థ ప్రతిఘటనతో వెనక్కి తగ్గినట్టు కనిపించిన డ్రాగన్‌ దేశం చైనా, మరో దొడ్డి దారిని కనిపెట్టి, దాన్నుంచి మెలమెల్లగా దక్షిణాసియాలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోంది.


Nepal and China have agreed to prepare a joint project on infrastructure development of the Nepal-China Silk Road Economic Belt.

భూటన్‌లోని డొక్లాం "ట్రైజంక్షన్‌" అనబడే "చికెన్-నెక్" ప్రాంతంలో చైనా తన రవాణా కోసం రోడ్ వేయబోయి భంగపడి ఖంగుతిన్న తరవాత,ఇప్పుడు తన సహజ విధానమైన "సలాం స్లైసింగ్"  (కొద్ది కొద్దిగా కనబడకుందా భూబాగాన్ని కబ్జా చేసే విధానం) ను అమలు చేయటం ప్రారంభించింది. అయితే ఇక్కడ తన భౌగోళిక స్వరూపాన్ని పొరుగుదేశాల అవసరాలతో తనకు తగ్గట్టుగా కొద్ది కొద్దిగా మార్చుకోవటం అన్నమాట. ఇప్పటికే భారత లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ చెప్పినట్లు దొంగ తనంగా దొడ్డిదారిని సిద్ధం చేసింది.  ఇప్పటికే భారత లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ చెప్పినట్లు దొంగ తనంగా దొడ్డిదారిని సిద్ధం చేసింది. 


భారత్ ను భౌగళికంగా దెబ్బతీయటానికి "భూటాన్" ద్వారా లడాయి పెట్టుకుని అవమానం పొందిన చైనా  ఇప్పుడు టిబెట్ -నేపాల్‌ సరిహద్దులను కలిపే, టిబెట్‌ లోని గతం లో మూసివేసిన సుదీర్ఘ జాతీయరహదారిని పునఃప్రారంభించింది. టిబెట్‌ లోని "జిగాజే విమానాశ్రయం" నుంచి ఆ నగర కేంద్రం వరకు విస్తరించి ఉన్న 40.4 కిలో మీటర్లు, పొడవు, 25 మీటర్ల వెడల్పైన సువిశాల ప్రధాన రహదారిని (హైవే) శుక్రవారం ప్రజా రవాణా కోసం తెరిచినట్టు అధికార పత్రిక "గ్లోబల్‌ టైమ్స్‌" ఒక కథనం ప్రచురించింది. దీనివల్ల ప్రయాణ సమయం గంట నుంచి అర గంటకు కుదించబడుతుందని వివరించింది.  అయితే, పౌరప్రయాణ అవసరాల కోసం అంటూ, వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం చైనా తీసుకొందని సైన్యానికి చెందిన అనేక మంది నిపుణులు భావిస్తున్నారు.


ఎప్పటినుండో చైనా నుంచి నేపాల్‌కు భూ మార్గం ద్వారా "రైల్వే-లైన్‌" వేయాలని, తద్వారా దక్షిణాసియాలోకి చొచ్చుకు రావాలని చైనా ప్రణాళిక లోని తొలి అంకానికి తెరలేపింది. ఈ నిర్ణయం అందులో భాగమేనని, భౌగోళికంగా భారత్‌ ను మరోసారి లక్ష్యంగా గురి పెడుతూ కొత్త సవాల్‌ బలంగా చేసినట్టే అవుతుందని అంటున్నారు. అయితే ఇది నేపాల్ చైనా ఇరు దేశాలు చేసుకున్న "నేపాల్‌-చైనా సిల్క్ రోడ్ & ఎకనమిక్ బెల్ట్" ఒప్పందానికి పొడిగింపు అన్నమాట.  

China opens dual-use highway to Nepal via Tibet

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: