జమ్మూ కాశ్మీర్ లో భూకం..!

Edari Rama Krishna

ప్రకృతికి కోపం వస్తే..ఎంతటి అనర్ధాలకు దారి తీస్తుందో మొన్నటి వరకు అమెరికా లో జరిగిన దారుణాలే చెబుతున్నాయి.  ఆ మద్య నేపాల్, కాట్మండ్ లో జరిగిన భూకంపం వల్ల ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు.  తాజాగా జమ్మూకశ్మీర్ లో భూకంపం సంభవించింది.


రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 4.5గా నమోదైంది.  కాకపోతే ఇది స్వల్ప భూ కంపం అయినా దీని ప్రతాపం మాత్రం భకం కలిగించే విధంగా ఉందని అంటున్నారు.  అక్కడ ప్రజలకు  భూకంప తీవ్రతతో ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించిపోయింది.  


దీంతో కశ్మీరీలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం కలగలేదని అంటున్నారు అధికారులు.  దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: