ఝార్ఖండ్‌ రాష్ట్రంలో ఘోర అగ్ని ప్రమాదం

Edari Rama Krishna
గత కొన్ని సంవత్సరాల నుంచి భారత దేశంలో బాణసంచా పరిశ్రమలకు ఎన్నిసార్లు జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించినా కొన్ని అజాగ్రత్తల వల్ల పరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు జరుగుతున్నాయి.   కొన్ని అక్రమ భాణా సంచ పరిశ్రమల్లో ఇలాంటి తరుచూ జరుగుతూనే ఉన్నాయి. త్వరలో దసర,దీపావళి పండుగల వస్తున్న నేపథ్యంలో  బాణసంచా పరిశ్రమ మందుగుండు సామాగ్రి తయారు చేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.  

ఝార్ఖండ్ రాష్ట్రం కుమార్‌డూబి ప్రాంతంలోని ఓ బాణసంచా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని భారీగా వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 8 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు.

అధికారులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషయమంగా ఉందని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపారు.  బాణాసంచ పరిశ్రమలకు ఎన్నిసార్లు జాగ్రత చర్యల గురించి వివరించినా వారు చేసే నిర్లక్ష్యం వల్ల ఎన్నో నిండు జీవితాలు అగ్గిపాలైతున్నట్లు అధికారులు చెబుతున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: