నాకు ప్రాణహాని ఉంది..ముందస్తు బెయిల్ కోసం హనీప్రీత్ సింగ్ పిటిషన్..!

Edari Rama Krishna
డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ గురించి గత కొన్ని రోజులుగా రక రకాల వార్తా కథనాలు వస్తున్నాయి.  హనీప్రీత్ నేపాల్ కి పారిపోయిందని అక్కడ రక రకాల వేషాలు మారస్తూ గుర్తు పట్టకుండా తిరుగుతుందని ఆమె సమాచారం కోసం భారత పోలీసులు కూడా వెళ్లనట్లు వార్తలు వచ్చాయి.  మరో కథనంలో హనీ ప్రీత్ సింగ్ భారత దేశంలోనే ఉందని..బీహార్ లో కనిపించిందంటూ పుకార్లు వచ్చాయి.  

డేరా బాబా అరెస్టు అయిన రోజు ఆయనను తప్పించడానికి గుర్మిత్ శిశ్యులను రెచ్చగొట్టి అల్లర్లు సృష్టించడానిక ప్రయత్నించినట్లు హనీ ప్రీత్ సింగ్ కేసు నమోదు అయ్యింది.  అంతే కాదు గుర్మిత్ కి సంబంధించిన కీలక సమాచారం హనీ ప్రీత్ వద్ద ఉందని అందుకే ఆమె పోలీసులకు చిక్కకుండా తిరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి.  తాజాగా రాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ ఢిల్లీలోనే మకాం వేసినట్లు తెలుస్తోంది.

సాధ్వీలపై అత్యాచారం కేసుల్లో డేరాబాబాకు జైలుశిక్ష పడిన అంతరం హనీప్రీత్ మాయమైన సంగతి తెలిసిందే.  అయితే తనకు ప్రాణభయం ఉందని, ఎక్కడ, ఎవరు చంపేస్తారోనన్న ఆందోళనలో ఉన్నానని, చెయ్యని తప్పుకు తనను ఇరికించాలని చూస్తున్నారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హనీప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది.

ప్రస్తుతం ఆమె ఢిల్లోనే ఉన్నట్టు చెబుతున్నప్పటికీ... దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఢిల్లీలో ఆమె ఎక్కడ ఉందో ఎవరికీ అంతుబట్టడం లేదు. పిటీషన్ లో  తాను దాఖలు చేసిన పిటిషన్ లో పలు విషయాలను హనీప్రీత్ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. తనకు బెయిల్ ఇస్తే, ఎక్కడికీ పారిపోబోనని, పోలీసుల విచారణకు సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చింది.

తనకు భారత చట్టాలపై నమ్మకం ఉందని, తానే తప్పూ చేయలేదని వాపోయింది. మరోవైపు ముందస్తు బెయిల్ దరఖాస్తుపై సంతకం చేసేందుకు సోమవారం హనీప్రీత్ సింగ్ తన కార్యాలయానికి వచ్చినట్టు ఆమె న్యాయవాది ప్రదీప్ ఆర్య వెల్లడించారు.

హనీ ప్రీత్ సింగ్ తాను నేపాల్ కు పారిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని, ఎక్కడ తనను చంపేస్తారోనన్న భయంతో దాగుండి పోయానని చెప్పింది.ప్రాథమికంగా ఆమెపై దేశద్రోహం కేసు పెట్టారు. ఆమెపై అలాంటి అభియోగాలు మోపడం సరైంది కాదు...'' అని ఆమె తరుపు న్యాయవాది వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: