బాబు దెబ్బకు బోండా ఉమ ఔట్..!!?

Vasishta

బోండా ఉమ టీడీపీ ఎమ్మెల్యే. మీడియాలో చాలా ప్రముఖంగా కనిపిస్తూ ఉంటారు. ప్రతిపక్షంపై విరుచుకు పడడంలో ముందుంటారు. అలాంటి బోండా ఉమ ఇప్పుడు మీడియాలో కనిపించడం లేదు. ఇంతకూ ఆయన ఏమైపోయారు..?


           విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి బోండా ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్, రోజా, కొడాలి నాని.. ఇలా ఎవరి నోరు మూయించాలన్నా బోండా ఉమ ముందుండే వారు. పార్టీ అధినేత చంద్రబాబు కూడా బోండా ఉమకు ఫ్రీహ్యాండ్ ఇచ్చారు. దీంతో మీడియాలో ప్రతిపక్షంపై ఒంటికాలిపై లేచేవారు. అయితే ఇటీవలికాలంలో సీన్ రివర్స్ అయింది. బోండా ఉమ అస్సలు కనిపించడం లేదు.


          ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో బోండా ఉమకు స్థానం దక్కుతుందని అంతా భావించారు. ఉమ కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ అధినేక కరుణించలేదు. దీంతో బోండా ఉమలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కాపుల గొంతు కోస్తారా.. అంటూ కొత్త గొంతుక లేవనెత్తారు. దీంతో బాబు మరింత సీరియస్ అయ్యారు. అసలే కాపుల సెగ తగులుతున్నవేళ సొంత పార్టీ నేతలే ఇలా మాట్లాడడం తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో బోండా ఉమను పిలిపించి మాట్లాడారు. ఉమ కూడా మెత్తబడ్డారు.


          ఆ తర్వాత పరిస్థితులన్నీ సద్దుమణిగాయి అనుకున్నారు. కానీ స్లోగా బోండా ఉమ సైడైపోయారు. ఇందుకు అధిష్టానం సంకేతాలే కారణమని తెలుస్తోంది. మీడియా ముందుకు బోండాను వెళ్లనీయకపోవడం, పార్టీ కార్యక్రమాల్లో కూడా ఆయన్ను పార్టిసిపేట్ చేయనీయకపోవడం లాంటి పరిణామాలు జరిగాయి. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో మొక్కుబడిగానే సాగింది. ఈ నేపథ్యంలో పార్టీలో గతంలో ఉన్న అధికార ప్రతినిధి పదవి కూడా దక్కలేదు. దీంతో ఉమ ఆశలు మరింత ఆవిరైపోయాయి.


          బోండా ఉమ కూడా టీడీపీలో ఇక తన పని అయిపోయినట్లేనని భావిస్తున్నట్టు సమాచారం. అందుకే అంతర్గతంగా పవన్ కల్యాణ్ తో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి తనకు టికెట్ రాకపోవచ్చని భావిస్తున్న ఉమ.. జనసేన తరపున పోటీ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే టీడీపీకి, ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. మొత్తానికి టీడీపీలో ఓ వెలుగు వెలిగిన బోండా ఉమ పని ఇక అయిపోయినట్టేనని విజయవాడ వర్గాల సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: