ఐక్యరాజ్యసమితి ఆహ్వానం..ఎవరికో తెలిస్తే షాక్..!

Edari Rama Krishna
ఐక్యరాజ్యసమితి ఆహ్వానం అంటే దేశంలో ఎంతో గొప్ప ప్రముఖులకు అయి ఉంటుందని ప్రతి ఒక్కరూ ఊహిస్తారు..కానీ మీరు తప్పులో కాలు వేశారు.. ‘వరల్డ్ టాయిలెట్ డే’ సందర్భంగా ఐక్యరాజ్య సమతి ఆహ్వానం పలికింది ఎవరికో కాదు..భారత దేశంలో గత కొన్ని రోజులుగా పెను సంచలనాలకు కేంద్ర బింధువుగా ఉన్న గుర్మిత్ రామ్ రహీం సింగ్ అలియాస్ డేరా బాబా, ఆయన దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్ సాన్.  నవంబరు 19 జరగనున్న వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా ప్రసంగించాలంటూ వారికి ఐక్యరాజ్య సమితి ఆహ్వానం అందించింది.

ఒక‌ప‌క్క‌ అత్యాచార కేసుల్లో శిక్ష అనుభ‌విస్తూ గుర్మీత్ బాబా, నెల‌న్న‌ర త‌ర్వాత పోలీసుల‌కు ప‌ట్టుబ‌డి హ‌నీప్రీత్‌లు దేశంలో వార్త‌ల్లో నిలుస్తుంటే, మ‌రో ప‌క్క‌ ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌ల ర‌క్ష‌ణ విభాగం వారు ప్ర‌పంచ మ‌రుగుదొడ్డి దినోత్స‌వం సంద‌ర్భంగా టాయ్‌లెట్లు క‌ట్టించుకోవాల‌ని ప్ర‌చారం చేయ‌డంలో వారిద్ద‌రి గొంతు క‌ల‌పాల‌ని కోరడం నెటిజ‌న్ల‌ను షాక్‌కి ఇచ్చింది. 

ఐక్యరాజ్య సమతికి చెందిన పరిశుభ్రమైన నీరు, మరుగుదొడ్లపై అవగాహన కల్పించే విభాగం బుధవారం ఉదయం ఈ ట్వీట్ చేసింది. ఇంతకీ ఆ ట్విట్ లో ఏముందో తెలుసా..‘డియర్ హనీప్రీత్, రామ్ రహీం మీరు వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తారని భావిస్తున్నామని దానిలో పేర్కొంది. దీంతో ఖంగు తిన్న నెటిజన్లు తమదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు.

`జైలు నుంచి త‌ప్ప‌కుండా గొంతు కలుపుతారు`, `ఇంకో 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ అడ‌గండి` అంటూ న‌వ్వు పుట్టించే ట్వీట్లు చేశారు. `మీ ట్విట్ట‌ర్ అకౌంట్‌ను హ‌ర్యానా ప్ర‌భుత్వం వాడుతోందా?` అంటూ ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌ల‌ర‌క్ష‌ణ విభాగాన్ని ఉద్దేశించి కాంగ్రెస్ నేత ప్రియాంక చ‌తుర్వేది ట్వీట్ చేసింది.  అయితే ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో ఈ ట్వీట్ వివాదాస్పదం కావడంతో ఐక్యరాజ్య సమతి వెంటనే దానిని తొలగించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: