గుర్మీత్ బాబా లాంటి మరొక స్టోరీ.

KSK
బాబా అనే ముసుగు వేసుకుని అనేకమంది ఎంతటి దారుణాలకి పాల్పడుతున్నారు అనేది రీసెంట్ గా చూస్తూ ఉన్నాం మనం. మరొక దుర్మార్గుడు బాబా ముసుగులో పంజా విసురుతూ 19 సంవత్సరాల యువతి ని రేప్ చేసాడు.

పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళ్తే... మహారాష్ట్రలోని సింధు దుర్గ్ జిల్లా అచ్రా పట్టణానికి చెందిన 19 ఏళ్ల యువతి గోవా రాష్ట్రంలోని వాస్కో నగరానికి వచ్చింది.

కర్నాట్టక రాష్ట్రం లో కుందాపూర్ బాబా అనుకుంటూ చెప్పుకుని తనకి తానే మహిమలు ఉన్నాయి అని చాటుకునే ఒక బాబా కి అనుచరుడు ఐన సంతోష్ కుమ్భార్ ఆమె కి పరిచయం అయ్యాడు.

ఆమెకి రకరకాల మాటలు చెప్పి తన సొంత ఊర్లో దింపుతా రమ్మంటూ కారులో ఎక్కించుకుని దార్లో మత్తు మందు కలిపిన పానీయం ఆమెకి ఇచ్చాడు. ఆమె మత్తులోకి జారుకున్న తరువాత వాస్కో నగరంలోని ఒక అతిధి గృహానికి తీసుకువెళ్లాడు.

బాబా కి ఆమెని అప్పజెప్పి రేప్ చేసుకోమని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అతగాడు. బాబా ఆమెని రేప్ చేసి , వీడియో కూడా తీసి ఎవరికీ చెప్పద్దు అని వార్నింగ్ ఇచ్చాడు . ఆమె వెంటనే పోలీసులని ఆశ్రయించడం తో గోవా పోలీసులు బాబా కోసం గాలిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: