ఈసారైనా వైసీపీకి కలిసి వొచ్చేనా..?!

veeru

ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షానికి మొన్నటి వరకు ముచ్చెమటలు పట్టించి..ప్రతి విషయంలోనూ తమదైన స్టైల్లో స్పందించిన ప్రతి పక్షం ఇప్పుడు కాస్త కూల్ గా ఉన్నట్లు కనిపిస్తుంది.  మొన్నటి నంద్యాల ఉప ఎన్నికల ప్రభావం వైసీపీకి కాస్త షాకింగ్ గానే ఉన్నట్లుంది. అంతే కాదు గత కొంత కాలంగా వైఎస్ జగన్ కి కూడా ఏదీ కలిసి రావడం లేదని అంటున్నారు.  తనకు ఎంతో సహకరిస్తాడని వచ్చి ఎన్నో వ్యూహాలు రచించిన పీకే ప్లాన్ కూడా ఏమాత్రం వర్క్ ఔట్ కాలేక పోయాయి. 


వైఎస్ జగన్ కు ఇప్పుడు కొత్త సెంటిమెంట్ పట్టుకుంది. ఈ మధ్య జగన్ స్వామీజీలను కలుస్తున్నారు. వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. ఏం చెబితే అది చేస్తున్నారు. నిలబడమంటే నిలబడుతున్నారు. కూర్చోమంటే కూర్చుంటున్నారు. ఆ కోవలోనే ఇప్పుడు జగన్ కు వాస్తు పిచ్చి పట్టుకుంది. ముఖ్యమంత్రి కావాలంటే జనం కరుణ కావాలన్నది మర్చిపోయి నవగ్రహాలను నమ్ముకుంటున్నాడు. అధికారంలోకి రావాలని జగన్ ఎంత తహతహలాడినా ఏపీ ప్రజలు మాత్రం కనికరించలేదు. ప్రతిపక్షానికే పరిమితం చేశారు. అక్కడ్నుంచి జగన్ కు అన్నీ ఎదురుదెబ్బలే.


బలమైన ప్రతిపక్షం కాస్తా ఎమ్మెల్యేలు రాంరాం చెప్పడంతో పూర్తిగా ఢీలాపడిపోయింది. అటుచూస్తే నాయకుల్లో నమ్మకం లేదు. ఇటు చూస్తే ప్రజల్లో పరపతీ లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం చేపట్టినా కేడర్ తప్ప జనం రావడం లేదు. వీటన్నింటికీ ఇప్పుడు వైసీపీ నేతలకు దొరికిన సాకు వాస్తు.మొదట్నుంచి కూడా వైసీపీ అధినేత జగన్ నివాసం లోటస్ పాండ్ ఎన్నో వివాదాలకు కేంద్రబిందువు. ఆ బిల్డింగ్ ను ఓ రాజభవనంలా కట్టించుకున్నాడు జగన్.. కానీ అక్కడ్నుంచి ఏ పనిచేసినా పార్టీకి, జగన్ కు కలసిరావడం లేదని వైసీపీలో ప్రచారం జరుగుతోంది.


ఇప్పుడు స్వామీజీలు కూడా లోటస్ పాండ్ నివాసం వాస్తు బాగోలేదని తేల్చడంతో.. జగన్ ఆలోచనలో పడ్డారంటున్నారు. ఇటీవల ఎక్కువగా స్వామీజీలను కలుస్తున్న జగన్.. వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వారు చెప్పిన సమయానికే పాదయాత్ర ముహూర్తం కూడా పెట్టారు. అదే బాటలో ఇప్పుడు వాస్తు విషయంలో మార్పులు చేయడానికి సిద్దమైనట్లు సమాచారం. అయినా ఏపీ ప్రతిపక్ష నేత ఏపీలో ఉండకుండా హైదరాబాద్ లో ఎందుకండి. ఇక్కడ ఎప్పుడో జెండా పీకేశారు కదా. అయినా అప్పట్లో వాస్తు, స్వామీజీలు వేటీనీ జగన్ నమ్మలేదు.


కానీ ఇప్పుడు అధికారంలోకి రావాలన్న తపనతో ఎవరేం చెప్పినా చేసేస్తున్నారు. అసలు మీరు చేయాల్సింది వాస్తు మార్పులు కాదు జగన్... మనస్సులో మార్పులు. చేయాల్సింది ప్రజాసమస్యలపై పోరాడటం సార్.. అప్పుడే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. మీకు ఓటేస్తారు. అంతేకానీ జనాన్ని పట్టించుకోకుండా ఎన్ని వాస్తు మార్పులు చేసినా ఏ దేవుడు కూడా తలరాతను మార్చడు... అది గుర్తుంచుకుని ఇప్పటికైనా జనం కోసం పోరాడండి. పదవులు అవే వస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: