ఆధార్ తో కెంద్రానికి కోటాను కోట్లు రూపాయలు ఆదా

కొందరు మోసగాళ్ళు చేస్తున్న దగా ద్వారా సామాన్యులు నిరుపేదలకు అందవలసిన ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అందించే ప్రయోజనాలు అట్టడుగు వర్గాల వారికి అందట్లేదు. ఈ శూన్యాన్ని భర్తీ చేసే పని ఆధార్ గుర్తింపు కార్డ్ సమర్ధవంతంగా చేస్తుంది. 


 
ఆధార్ వల్ల ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దాదాపు 58 వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలేకనీ తెలిపారు. మోసపూరిత లబ్ధిదారులకు ఈ ఫొటో మరియు బయో మెట్రిక్ గుర్తింపు కార్డు వలన అడ్డుకట్ట పడటంతో ప్రభుత్వానికి ఈ మేర ఆదా అయ్యిందని "యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా" (యూఐఏఐ) చైర్మన్‌గా వ్యవహరించిన నందన్ నీలేకనీ తెలిపారు. యూపీఏ ప్రభుత్వం ఆధార్ పథకాన్ని ప్రారంభించగా, దాన్ని నరెంద్ర మోదీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా కొనసాగించింది. ఇప్పటి వరకూ ఆధార్ కోసం వందకోట్ల మందికిపైగా రిజిస్టర్ చేసుకున్నారు.





ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆధార్‌ తో అనుసంధానం చేయడం వల్ల అసలైన లబ్ధిదారులకే ప్రయోజనం చేకూరింది. మోసగాళ్లు నకిలీల బెడద తప్పడంతో 9 బిలియన్ డాలర్ల మేర భారత ప్రభుత్వానికి ఆదా అయ్యిందని "ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్-(ఐ ఎం ఎఫ్),  వరల్డ్ బ్యాంక్ వార్షిక భేటీలో పాల్గొన్న నందన్ నీలేకనీ వెల్లడించారు. "భారత దేశంలో 50 కోట్ల మందికి పైగా బ్యాంక్ ఖాతాలను ఆధార్‌ తో అనుసంధానించారు. నగదు బదిలీ కింద ప్రభుత్వం రూ.77 వేల కోట్లను ఎలక్ట్రానిక్ పద్ధతిలో వారి ఖాతాల్లో జమ చేసింది. ప్రపంచం లోనే అతిపెద్ద నగదు బదిలీ కార్యక్రమంతో పాటు, ప్రభుత్వం తీసుకున్న ఇతర చర్యల వల్ల భారీ మొత్తం ఆదా అయ్యిందని" నందన్ నీలేకని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: