లోకనాయకుడు నుంచి పక్కా లోకల్ వరకు ....

ఒక నటుడు నాయకుడు కావటం దక్షిణ భారతదేశం అందునా తమిళనాడులో అతి సహజం. అందుకే రజనికాంత్ కమల్ హసన్ లు తాము అధికారం లోకి రావాలని ఎలా? రావాలనే విషయాలపై తికమక పడుతూ తహతహ లాడుతున్నారు. జాతికి ఈ "హీరో టర్నుడ్ పొలిటికల్ లీడర్స్" చేసిన మేళ్ళు దాదాపు శూన్యం. ముఖ్యంగా లక్షల కోట్లలో తమ అనుయాయులకు ప్రజా ధనం దోచిపెట్టారు. ఉదాహరణకు జయలలిత శశికళలు చాలు. ఇక కమల్ హాసన్ తన శకాన్ని ప్రారంభిస్తారట.  




తన రాజకీయ రంగప్రవేశం ప్రకటించిన తమిళ సినీ నటుడు కమల హసన్ కు అప్పుడే పక్కా రాజకీయ నాయకుని లక్షణాలు కమ్ముకున్నాయి. గత సంవత్సరం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెద్ద నోట్ల రద్దును సమర్థిస్తూ, నరెంద్ర మోదీకి సెల్యూట్ అంటూ, ట్వీట్ చేసిన కమల్ హసన్ ఇప్పడు తన స్వరం  మార్చారు. అయితే రాజకీయ నాయకుడైన తరవాత కమల్ హసన్ నాడు తాను చేసిన ట్వీట్ కు సవరణగా "తప్పయింది-క్షమించండి" అని ఇప్పుడు కోరటం విడ్డూరం.



Kamal Hassan : History of Relationships, Marriage & Women. Gouthami, Sarika, Simran, vani


అలాగే నరెంద్ర మోడీ కూడా తన తప్పును తాను తెలుసుకుంటే, ఆయనకు కూడా మరోసారి సెల్యూట్ చేస్తానని అన్నాడు. మొదటి సారి సెల్యూట్ కు ఇప్పుడు "సారీ" ఇప్పుడు, చెప్పిన లోక నాయకుడు,  మోదీ తప్పుతెలుసుకుంటే ఈయన మళ్ళీ మనకు సెల్యూట్ చేసి తరవాతెప్పుడో   సారీ చెప్పి "పాదాలు పట్టు కుంటారా? ప్రజల పాదాలు" ఎందుకయ్యా! మీ కంత ప్రజల సమయం వృధా చేసే పనులు? 


ఒక తమిళ పత్రికకు తను రాసిన వ్యాసంలో  కమల్ హసన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు చేసిన తప్పును అంగీకరించడం దానిని సరిదిద్దు కోవడం ఒక రాజనీతిజ్ఞుడి లక్షణమని అతను అన్నాడు. నరెంద్ర మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తొందరపడి సమర్దించడం తాను చేసిన పెద్ద తప్పు అన్నారు. నోట్ల రద్దుపై సమర్థిచినందుకు ప్రజలు తనను క్షమించాలని కోరారు. కేవలం ధనవంతుల కోసం మాత్రమే మోడీ నోట్లురద్దు నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దుతో కేవలం రాజకీయ నాయకులకు లబ్ది జరిగిందే తప్ప సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఉపయోగం లేదని అన్నారు.


 


అప్పట్లో పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే, "సెల్యూట్ మిస్టర్ మోడీ! అన్ని రాజకీయ పార్టీలు ఉత్సవం చేసుకోవాల్సిన విషయం" అంటూ కమల్ హసన్ అత్యుత్సాహంతో  ట్వీట్ చేశాడు.

 

రెండు నెలల కిందటే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన కమల్ హాసన్, కచ్చితంగా బీజేపీలో మాత్రం చేరను, అని ప్రకటించిన విషయం గమనించాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు "నోట్ల రద్దును సమర్థించడం తప్పే" అని అంగీకరించడం గమనార్హం. అయినా "ప్రవహించి సముద్రలో కలసిన నీటికి ఆనకట్ట కట్టటం సాధ్యమా? అదే గత జల సేతు బంధనం" అంటారు దీన్నే. అయితే ఇప్పుడు పెద్ద నోట్ల రద్దును తాను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడన్న విషయాన్ని మాత్రం కమల్ హసన్ చెప్పలేదు.


కారణం మనకర్ధం కాదా? ఆయన ఇప్పుడు బాజపా లో చేరటం లేదు అందుకే గతంలో తాను ప్రశంసించిన మెప్పుకోలును వెనక్కి గుంజుకొంటున్నాడన్న మాట! అది అసలు సాధ్యమా! సినిమా తెరపై యే వేషాలు వేసినా అది వినోదం. నిజ జీవితం లో అది సాధ్యం కాదు. పలు పెళ్ళిళ్ళు చేసుకొంటూ విడాకులిస్తూ, తన జీవితాన్నే సరిగా నడుపుకోలేని ఈయన రాష్ట్రా ధికారాన్ని ఎలా నడపగలరు? ఇలాంటి స్థిమిత మనస్కులు కానివారి చేతిలో తమ భవితను అంత అమాయకంగా తమిళ ప్రజలు పెట్టేస్తారా? ఏమో? సినిమా పిచ్చోళ్ళకు ఏమి చెప్పగలం.




గతంలో తాను మెచ్చుకున్న నాయకుల్ని కూడా ద్వేషించటం మెదలెట్టాడన్న మాట! ఇక కమల్ హసన్ రాజకీయనాయకుడై పోయాడన్న మాట.  "లోక నాయకుడు అన్న గౌరవం నుండి పక్కా లోకల్ అయ్యాడు" మన కమల్, సారీ తమిళ కమల్. అంటే తను రాజనీతిఙ్జుడని మనం అనుకోవాలి. 


ప్రశంసించిన మెప్పుకోలును వెనక్కి గుంజుకొంటున్నాడన్న మాట! అది అసలు సాధ్యమా! సినిమా తెరపై యే వేషాలు వేసినా అది వినోదం. నిజ జీవితం లో అది సాధ్యం కాదు. పలు పెళ్ళిళ్ళు చేసుకొంటూ విడాకులిస్తూ, తన జీవితాన్నే సరిగా నడుపుకోలేని ఈయన రాష్ట్రాధికారాన్ని ఎలా నడపగలరు? ఇలాంటి స్థిమిత మనస్కులు కానివారి చేతిలో తమ భవితను అంత అమాయకంగా తమిళ ప్రజలు పెట్టేస్తారా? ఏమో? సినిమా పిచ్చోళ్ళకు ఏమి చెప్పగలం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: