చంద్ర-వ్యుహంలో బాగమే మోత్కుపల్లి, అరవింద్ గౌడ్ ల అలకలు

చంద్రబాబు నాయుడు ఏపని చేసినా దాని వెనకాల అద్భుత ఈక్వేషన్లు ప్రణాళికా బద్దమైన పథకాలు ఉంటాయి. ఆయన సిద్ధం చేసిన ప్రతి ప్లాన్లు విజయం సాధిస్తుందనే నమ్మకం లేకపోయినా ఆయన అంతా శాస్త్రబద్ధంగా చేస్తారు.  ప్రతిపక్షాలకి చెందిన ఏ నాయకుడిని ఎవరితో తిట్టించాలి, ఉదాహరణకు జగన్ మోహన్ రెడ్డిని ఏరోజు ఎవరితో తిట్టించాలి, రోజాని ఏ మహిళా మణితో చెక్ పెట్టించాలి, అనే విషయంలో చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసినంత జాగ్రత్తగా ఏ పార్టీ అధినేత చేయరు. కాపు రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబుని బాగా ఇబ్బంది పెడుతున్న ముద్రగడని తెదేపాలో వేరే కులాల నాయకులు ఎవరూ పల్లెత్తు మాట అనరు. చినరాజప్ప, గంటా శ్రీనివసరావు తదితర కాపు నేతలకే ముద్రగడని విమర్శించే బాధ్యత అప్పగిస్తారు. 



అలాగే దళితకార్డు, మహిళకార్డు, మతకార్డ్, కులకార్డ్ అంటూ ఏది ఎప్పూడు ఎలా ఎప్పుడు వాడాలి అనే విషయంలో కూడా చంద్రబాబుకు ముందే అవగాహన పక్కాగా ఉంటుంది.  ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వస్తే, రేవంత్ రెడ్డి పార్టీ మారడం "నిశ్చయం" అయ్యాక, ఎయిర్-పోర్ట్ లో రేవంత్ కలుస్తానన్నా చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు.  అనూహ్యంగా ఈ రోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ పోలిట్ భ్యూరో సమావేశానికి హాజరయిన రేవంత్ రెడ్డిని కౌంటర్ చేసే బాధ్యతను చంద్ర బాబు మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లకి అప్పగించారు.





ఇక్కడ కూడా కులం కార్డే వాడారు. తెలంగాణలో ఉన్న రెడ్లు అంతా కలిసి ఒకకూటమిగా బలపడే ప్రయత్నం చేస్తున్నారు. కారణం కెసిఆర్-బాబు సంయుక్త కుల సంఘట్టన పథకం 'వెల్-కం'.  వెలమలు పూర్తిగా కెసిఆర్ తెరాసతో ఉండగా, కమ్మలంతా తమ మాతృపార్టీ టిడిపితోనే ఉన్నారు. ఇక తెదేపాకి మిగిలింది బీసీలు, ఎస్సీలే. అందుకే మోత్కుపల్లి నరసింహులు ఎస్సీ, అరవింద్ కుమార్ గౌడ్ బీసీ, కులాలకు చెందిన ఈ ఇద్దరు నేతలకే రేవంత్ రెడ్డి పై దాడి చేసే బాధ్యత లని వారికి చంద్ర బాబు అప్పగించారు. రెచ్చగొట్టబడ్డ వాళ్ళు ఇంకా ఎంతలా రెచ్చిపోతారో మనం రాజకీయ వెండితెరపై చూద్ధాం.





తెలంగాణ తెలుగు దేశం పార్టీ పాలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డి రావడమే ఒక జోక్, అయితే, ఆయనతో తగాదా పెట్టు కుని పార్టీని నమ్ముకున్న నాయకులిద్దరు అలిగి సమావేశం నుంచి వెళ్లిపోవడం మరో జోక్. కాకపోతే ఈ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయేటంతగా నాయకులిద్దరూ అలిగిన అసలు కారణం వేరే ఉందని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రోజు (శుక్రవారం) నాడు తెదేపా పాలిట్ బ్యూరో సమావేశం జరిగింది. 




దీనికి సహజంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి-తదితరులంతా హాజరయ్యారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వస్తున్న పుకార్లపై మోత్కుపల్లి-అరవింద్ కుమార్ గౌడ్ లు రేవంత్ ను నిలదీయగా, అసలే దూకుడు ఎక్కువగా ఉండే రేవంత్, వారికి వెటకారంగా జవాబు చెప్పడం వారు అలకపూని వెళ్లిపోవడం జరిగిపోయాయి. 


గమ్మత్తేమంటే ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాల్లో ఉండటంవలన హాజరు కాలేదు కాగా ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ బాబు హాజరుకాకపోవటం మాత్రం కాకతాళీయమో యాదృచ్చికమో మాత్రం కాదు. బయట ఉండి రాజకీయం చూస్తున్నారు వేచి ఉండే వేటగాళ్ళ లాగా!! 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: