రాజకీయ విశ్లేషణ: రెవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి జంపింగ్ నేపధ్యం

ప్రతిమనిషి తన జీవితంలో ఒక స్థాయికి రావాలని కోరుకుంటాడు. అది వారి వారి ఇష్టాలపై ఆధారపడి ఉండదు. ఆ ఇష్టాన్ని లక్ష్యంగా మార్చుకుని దాని సాధనకు చేసే కృషిపై ఆధారపడి ఉంటుంది. ఐతే మనం ఇక్కడ టి-టిడిపి రాజకీయనాయకునిలో వచ్చిన మార్పు అదే కాంగ్రెస్ లో చేరటానికి దారితీసిన పాసిటివ్ మరియు నెగెటివ్ పరిస్థితులను కొంచెం అధ్యయనం చేద్ధాం. ఇదేమీ శాస్త్రీయ పరిశొదన కాదు. కాకపోతే ఇవీ కారణాలు అని నిర్ణయానికి రావటానికి ఉపకరిస్తాయి.




ఒక చర్యకు అంతే స్థాయిలో ప్రతిచర్య ఉంటుంది. ఒక బంతిని వేగంగా గోడపైకి విసిరితే అంతే వేగంగా గోడకు తగిలి తిరిగి వస్తుంది కదా! అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ కలహాలను రాజకీయ ప్రయోజనాలకై వదిలేసి తమ అవసరాలకోసం వెల్+కం (వెలమ+కమ్మ) సంఘటనను సృష్టించి తెలంగాణాలో వీరి ప్రాబల్యంతో ఎన్నికల్లో గెలిచి అధికారం లోకి రావాలని ఆంధ్రప్రదేశ్ లో "రెడ్+కం+కాప్" అంటే అంతర్లీనం గా రెడ్డి వర్గాన్ని కాపాడు కుంటూ కమ్మ వర్గ ఆధిపత్యం సాధించటం ఇందుకు కాపుల సపోర్ట్ తీసుకోవటం అంటే నీ కింత నాక్కొంత అనే ప్రణాళికను సిద్ధంచేసుకొని చంద్రబాబు అధికారం స్థిరం చేసుకోవటమే లక్ష్యంగా పనిచేయాలని నిర్యించుకున్నారు.


ఇక్కడ రెడ్లు రెండు చోట్ల కూరలో కరేపాకు సామెతే. రెడ్లు రాజకీయాల్లో స్వాతంత్రత్పూర్వమే పాతుకుపోయారు. సంఖ్య ఎక్కువే. అనుభవమూ ఎక్కువే. రాజకీయాల్లో రాజీ ఉండదు. కాకపోతే సమయం కోసం ఎదురుచూస్తూ రాజీగా ఉన్నట్లు కనపడటమే. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం శాశ్వత మిత్రత్వం ఉండని అంటారు. అయితే రాజకీయ లక్ష్యం పోరాడే వాళ్ళ లెక్కలు వేరే ఉంటాయి.



ఎనుముల రెవంత్ రెడ్డికి తెలంగాణాలో ప్రముఖ నాయకుడు కావాలని ఉంది. అదే లక్ష్యం తో కెసిఆర్ తో అన్నింటికి తెగించి అంటే దూకుడు ప్రదర్శించి నాయకత్వానికి చేరువ అవ్వటానికి తెలంగాణా తెలుగుదేశం పార్టీని వేదిక చేసుకొని "ఓటుకు నోటు" లాంటి కేసులో ఇరుక్కుని పోరాటమే చేశాడు చేస్తున్నాడు కూడా! ఇలాంటప్పుడు రేవంత్ చెప్పినట్లు స్వార్ధం కోసం యనమల, పరిటాల, పయ్యావుల స్వంత ప్రయోజనాలకోసం బద్ధశత్రువులైన టిఆరెస్ టిడిపిని "వెల్+కం"  పేరుతో రాజకీయం చేస్తే చూస్తూ ఊరుకోవటానికి రెవంత్ వెర్రి పప్ప కాదుగా!  అందులోను 50 యేళ్ళు కూడా నిండని ఉరికే రక్తమున్న యువకుడు.



వృద్దులైన ఆ యిద్దరు తమ ప్రయోజనాల కోసమే పనిచేస్తుంటే రేవత్ ఈ "ఝలక్" ఇవ్వటం న్యాయం కాదా? ఇంతకాలం బద్దశత్రువులైన కెసిఆర్, సిబిఎన్ లు తమ స్వార్ధంతో  "అపవిత్ర రాజకీయ కుల సంకరం" చేస్తూ రాజకీయాలు చేస్తుంటే మద్యలో 'సాండ్-విచ్'  అయ్యేది రెవంత్ రెడ్డే కదా! ఇంతవరకు 'నువ్వంటే నువ్వనే' ధోరణిలో కేసిఆర్ తో పోరాడిన రెవంత్ సంఘటితమైన అపవిత్ర సంయోగములో బ్రతకగలడా? అందునా రెడ్డి వర్గానికి తెలంగాణాలో కెసిఆర్ చరమగీతం పాడే రూట్లో ఉన్నప్పుడు రెవంత్ తన రూట్ మార్చటం న్యాయమే కదా?



అందుకే రెడ్డి వర్గ ప్రాబల్యానికి అవకాశమున్న చోటు కాంగ్రెస్ అని గుర్తించి పకడ్బందిగా ప్రణాళిక రచించటంలో, దాన్ని అనుసరించటములో తప్పేమీ లేదే! దీనికి మోత్కుపల్లి నరసింహులు, అరవింద్ కుమార్ గౌడ్ లు ఆయన్ను వ్యతిరెకించటంలో  "ఆశపడే అవకాశం" ఉండటమే. టిటిడిపికి రెవంత్ వెళ్ళిపోయిన తరవాత వీళ్ళకు అవకాశం వస్తుందనేకదా!  "సింహం తిని పారేసిన తరవాత మిగిలిన బొమికల కోసం నక్కలు ఎదురుచూసే"  పంచతంత్ర కథ లాంటిది అన్నమాట.





వాళ్ళు పతివ్రతలైతే రెవంత్ ను ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నప్పుడే నిగ్గదీయాల్సింది. అలా జరగక పోవటానికి కారణం సిబిఎన్ గవర్నర్ గిరి ఎక్కడైనా ఇప్పించక పోతాడా? అని.  ఇక్కడెవరూ పతివ్రతలు కాదు. పోలిట్ బ్యూరో సమావేశానికి లోకేష్ హాజరు కాలేదు కారణం అలా ఐతే అక్కడే ఏదైనా హాట్-హాట్ చర్చలు జరిగితే తన నిర్ణయం ప్రకటించవలసి రావచ్చు, దాన్ని  డీల్  చేయలేని చేతగాని తనమే కారణం.  సిబిఎన్ ఎయిర్-పోర్టులో రేవంత్ కు అపాయింట్మెంట్ యిచ్చినా నిర్ణయం ప్రకటించాలి. అందుకే వాయిదా పద్దతి అనుసరించారు అపాయింట్మెంట్ యివ్వకుండా. 




వెలమలకు రెడ్లకు బేసిక్ గా పడి చావదు. జలగం వెంగళరావు కాలము లోని వాళ్ళకు కూలంకషంగా తెలుసు. వెలమలు, రెడ్లు రాజ్యాలు ఏలిన వాళ్ళే. చరిత్ర కూడా అదే చెపుతుంది.  ఇకపోతే కెసిఆర్ కు మాత్రం రెవంత్ "కంటి లోన నలుసు, కాలి లోన ముల్లు,  చెవి లోన జోరీగ, నోట్లో ని పచ్చివెలక్కాయ."   రెవంత్ ను నొక్కెయ్యాలంటే టిడిపి తో పొత్తు పెట్టుకోవటమే ఉత్తమమని నమ్మాడు. పేరుకు ప్రత్యేక తెలంగాణా అన్నా ఆయన మనసంతా ఆంధ్రా స్నెహితులే. ప్రత్యేక తెలంగాణా వచ్చాక ప్రజల కోరిక మేరకు వాళ్ళని దూరం పెట్టొచ్చుగా! అన్నీ ప్రయోజనాలు ఆంధ్ర కాంట్రాక్టర్లకే. రాష్ట్రం ఏర్పడిన తరవాత  "ఏక కుటుంబ నియంతృత్వం"  కొనసాగటం మినహా, ఉభయ రాష్ట్రాల సాధారణ ప్రజ లకు వరిగిందేమీ లేదు. సేం-టు-సేం. అందుకే కనీసం రేవంత్ కాంగ్రెస్ లేదా బాజపాలో చేరితేనైనా ఒక బలమైన ప్రతిపక్షం అంటూ ఏడుస్తుంది. అదీ లేకపోతే రాష్ట్రం 'అడవిపందులు పడ్ద కందిచేనే ఔతుంది'  



టిటిడిపి పోలిట్-బ్యూరో సమావేశం 


మాటల్లో సరిగ్గా కెసిఆర్ మొగుడే రెవంత్ పంచ్-డైలాగ్స్ తో పటపటలాడించ గలడు. బూతుల్లో కెసిఆర్ పోష్ట్ గ్రాడ్యుయేటైతే, రెవంత్ డాక్టరేట్. స్థాయిని మరచి ప్రొ. కోదండ రాం ను కెసిఆర్ అగౌరవంగా మాట్లాడినప్పుడే ఆయనకు పోయేకాలం వచ్చిందని తెలంగాణా వాసులు అనుకున్నారు. ఇప్పుడు పొరపాటున ఈక్వేషన్లు మారి రెవంత్ అనే అగ్నికి  కోదండరాం అనే ఆజ్యం తోడైతే జనానికి రోజు కొక రాజకీయ సినిమానే.   


జంపైన వీళ్ళు కనీసం ప్రతిపక్షంలో ఉన్నా కెసిఆర్ కు దడ ఉండేది



కాంగ్రెస్ లోని కురువృద్దుల వలన ప్రయోజనమేమిటో మూడున్నరేళ్ళుగా చూస్తూనే ఉన్నం. ఆ పార్టి ముసలి ముతకకంపు  కొడుతుంది, రెవంత్ రెడ్డి దూకుడుతో నైనా కొత్త రక్తం ఎక్కి ఎంతో కొంత ఉత్సాహం వెల్లివిరియవచ్చు. "పాలన  అంటరా ఎవడైనా ఒకటే, ఏ రాయి అయితేనేం పళ్ళూడగొట్టు కోవటానికి"   "నగరం చూస్తే నరకం ఊరుచూస్తే వల్లకాడు" లా ఉందిప్పుడు. ఏ కొంచెం మేలు చేసినా జనానికి స్వర్గ సమానం.             

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: