జనసేన పుష్పం పరిమళించ గలదా? ఒకవేళ పురిట్లోనే సంధి కొడితే?

పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. ఆ జన్మ పరిమళాలు భవితను చెప్పకనే చెపుతాయి. జనసేన చరిత్ర పరిశీలిస్తే అది సంపూర్ణ రాజకీయ పార్టీగా రూపుదిద్దుకునే అవకాశాలు మెరుగుపరచుకునే దానికి పూర్తికాల నాయకత్వం ప్రస్తుతానికి బల పడలేదు. నాలుగు సంవత్సరాల జనసేనకు కనీసం ఉండవలసిన ఉన్నత నాయకత్వం కనిపించదు. పవన్ కళ్యాణ్ కున్న ఒక్క సినీ అభిమానం పార్టీ నిర్వహణకు సరిపోతుందా? నేడు జనసేన రాజకీయ పార్టీ నుంచి ప్రజలు ఆశించేది కొండంత - రూపురేఖలు సరిగా దిద్దుకోలేని ఆ పార్టి ప్రజల ఆశలకు అణువంతైనా సహకారం అందించగలదా!  అనే అనుమానం పవన్ సాధారణ అభిమానిని, లేదా ఒక సాధారణ ఓటరును కలవరపరుస్తుంది. ఈ పార్టీ "మఖ లో పుట్టి పుబ్బ లో అస్థమించదు కదా!" - ప్రజా రాజ్యం వారసత్వం, ఆనవాళ్లు ఇప్పుడే కనిపిస్తునాయి. ముఖ్యంగా పవన్ కళ్యాన్ పరిచయం చేస్తున్న నాయకత్వాల వేషాలు బయటపడుతున్నాయి. 



ఉదాహరణకు జనసేనకు ఆరంభంలోనే ఆ పార్టీ అధికార ప్రతినిధి, పవన్ కళ్యాణ్ అభిమానుల నాయకుడు "కళ్యాణ్ దిలీప్ సుంకర" అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలో కళ్యాణ్ సుంకర హడావిడి చేశాడు. "ఓఎల్ఎక్స్‌ లో ఐ ఫోన్-7" అమ్ముతానని పెట్టి డమ్మీ ఫోన్ అమ్మిన కళ్యణ్ సుంకరను పోలీసులు అరెస్ట్ చేశారు. డమ్మీ ఫోన్ ఎందుకు అమ్మారని ప్రశ్నించి న వ్యక్తిని కళ్యాణ్ సుంకర ఎయిర్-గన్‌తో బెదరించాడు. కళ్యాణ్ దగ్గర నుంచి పోలీసులు ఫోర్డ్ ఎండీవర్ కార్, ఎయిర్-గన్‌ని స్వాధీనం చేసుకున్నారు. జనసేన తరపున కళ్యాణ్ సుంకర న్యూస్ ఛానెల్స్‌ లో అనేక చర్చల్లో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనసేనను పటిష్టం చేసుకోవాలని ఒక పక్క అధినేత పవన్ కళ్యాణ్ యోచిస్తోంటే ఆ పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న కళ్యాణ్ సుంకర అరెస్ట్ కావడం పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. 




అన్నం ఉడికిందా లేదా? అని తెలుసు కోవటానికి ఒక అన్న కణాన్ని పరిసీలిస్తే చాలు ఆ అన్నం తీరు తెలుస్తుంది. ఒక అధికార ప్రతినిధి ఆఫ్ట్రాల్ "ఒక సెకండ్ హాండ్ ఐ-ఫోన్" విషయంలోనే ఇంతగా దిగజారి, జనాన్ని మోసం చేయ ప్రయత్నిస్తే రేపు జాతి ఆర్ధిక భవిత ఒకవేళ ఆయనకు ఒప్పగిస్తే దాని పరిస్థితి ఏమిటనే ప్రశ్న కు పవన్ కళ్యాన్ సమాధానం ఏమివ్వగలడు. అయిన దాన్ ఇకి కాని దానికి గన్ కల్చర్ వాడితే ప్రజల రక్షణకు భరోసా ఎలా ఉంటుంది.




ప్రాధమిక దశలోనే పవన్ కల్యాణ్ నాయకత్వ నిర్మాణం ఇలా తగలడితే పూర్తి  "జనసేన రాజకీయ పార్టీ"  నిర్మాణం రూపురేఖ లు ఊహించటం జనాలకు అంత కష్టం కాదు. ఆశలు ఆకాశం వైపు చూస్తుంటే ప్రయత్నాలు మురికి కూపం స్థాయిలో ఉంటే ప్రజలకు సరైన నాయకత్వం లభించేదెలా? కళ్యాణ్ సుకర లాంటి వాళ్ళే జనసేనలో ఉంటే "పాలన గుండారాజ్" కాక ఏమౌతుందని ఈ వ్యవహారం తెలిసిన వాళ్ళంటున్నారు. పవన్ కళ్యాన్ అభిమానులనే వాళ్ళను ప్రక్కన పెడితే తప్ప ప్రయ త్నాలను కొనసాగించ లేదు. లేకుంటే "పురిట్లోనే సంధి కొడుతుంది" కుక్కమూతి పిందెలే పుడతాయని అంటున్నారు అందరు.  
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: