నారాయణ గ్రూప్ కళాశాలలు నరకలోక ప్రతిభింబాలని తెలుస్తుంది. అసాంఘిక కార్యకలాపాల నిలయలుగా మారాయన్న విమర్శలు రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నిజమెంత అనేది జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలు తేల్చాలి. ఎందు కంటే యాజమాన్య అధినేత ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ మంత్రి.
ఇప్పటికే అనేక మంది విద్యార్థులు టార్చర్ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. నారాయణ ఆస్తుల పైనా చాలా ఆరో పణలు మిన్ను నంటి ఉన్నాయి. ఈ నేపథ్యంలో నారాయణ కళాశాలల ఇద్దరు ఉన్నతోద్యోగులమద్య జరిగిందన్న ఆడియో టేపు ఇప్పుడు కలకలమే కాదు కలవరం కలిగిస్తున్నారు. ఇద్దరు ప్రముఖ స్థానంలో ఉన్న కీలక ఉద్యోగులు నారాయణ కళాశాల ల రహస్యాలపై చర్చించుకున్న ఫోన్ సంభాషణ ఆ టేపులో ఉంది.
హైదరాబాద్ రామాంతపూర్ లోని నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ నవీన్, అదే బ్రాంచ్‌కు చెందిన ప్రిన్సిపల్ సరిత మధ్య ఈ ఫోన్ సంభాషణ సాగింది. నారాయణ కళాశాల డబ్బు వ్యవహారం నుంచి అక్రమ సంబంధాల వరకు చాలా విషయాలపై ఇద్దరూ చర్చించుకున్నారు. నోట్ల రద్దు సమయంలో కోట్లాది రూపాయల రద్దైన పెద్ద నోట్ల నుంది నల్ల ధనాన్ని తెల్ల ధనంగా ఎలా మార్చుకున్నారో ఇద్దరు ఉద్యోగులు చర్చించుకున్నారు.
నోట్ల రద్దు సమయంలో కోట్లాది రూపాయలు ఎలా కొత్త నోట్లకు మార్చాలో అర్థంకాక గిలగిల కొట్టుకున్నాడని సరిత వ్యాఖ్యానించారు. యాజమాన్యంలో అత్యంత కీలక వ్యక్తికి పలువురు మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల పైనా నవీన్, సరిత చర్చించుకున్నారు. హయత్ నగర్ బ్రాంచ్‌కు చెందిన ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు గల కారణం కూడా ఇద్దరు ఉద్యోగులు చర్చించుకున్నారు. వనస్థలిపురం లోని నారాయణ అథిది గృహం అరాచకాలకు అడ్డా గా మారిందని నవీన్, సరిత చర్చించుకున్నారు.
ఈ ఆడియో టేపు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కానీ నారాయణ యాజమాన్యం నుంచి దీనిపై ఎలాంటి స్పందన ఇప్పటి వరకు రాలేదు. ఈ ఆడియో టేపులను బహిర్గతం చేశారన్న అనుమానంతో వైస్-ప్రిన్సిపల్ నవీన్ పై నారాయణకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. దీంతో అతడు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించాడు. ఆడియో టేపు బయటకు రావడంలో తన ప్రమేయం లేదంటున్నాడు.
తనకు ప్రాణ హాని ఉందని, తనకు ఏమైనా జరిగితే అందుకు మంత్రి నారాయణే బాధ్యత వహించాల్సి ఉంటుందని నవీన్ చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఆడియో టేపు వల్ల నోట్ల రద్దు సమయంలో కోట్లాది రూపాయల మనీ లావాదేవీలు, అక్రమ సంబంధాలు, నారాయణ కలాశాల అథిది గృహం లోని అరాచకాలపై ఇప్పుడు మరింత చర్చ జరుగుతోంది. ఉద్యోగి శ్రీలత ఆత్మహత్యకు గల కారణాలను నారాయణ ఉద్యోగులు ఫోన్‌లో వివరించుకున్న నేపథ్యంలో దాని ఆధారంగా శ్రీలత మృతిపై పోలీసులు చర్యలు తీసుకుంటారేమో చూడాలి.
మొత్తానికి కలకలం రేపిన ఈ ఆడియో టేప్ అసలు వైరలా? రియలా? రియలైతే ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధమిక విచా రణకు ఆదేశించాలని ప్రజలు కోరుకుంటు న్నారు. ఈ ఆడియో టేప్ ఆధారంగా సి.బి.ఐ. మరియు ఈ.డి లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరపక పోతే కావలసినంత అన్యాయం అటు ప్రజలకు ఇటు ప్రభుత్వాల కు మరొవైపు విద్యార్ధులకు జరిగి పోతూ ఉంది.
సాధారణంగా ఇలాంటి టేపులు దొరికితే, ఇలాంటి సంఘటనలు జరిగితే మీడియా బ్రేకింగ్ ల మీద బ్రేకింగ్ లు వేస్తూ, గంటల గంటలు లైవ్ లతో ఆదరగొట్టాలి. కానీ మన మీడియా ఇది అసలు పెద్ద విషయమే కాదు అన్నట్లు కళ్ళు మూసుకుంది. ఒకటి రెండు ఛానళ్ళు కాస్త హడా విడి చేసి ఆ తర్వాత సైలెంట్ అయిపోయాయి.
నారాయణ కాలేజ్ నుంచి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు యాడ్స్ రూపంలో ముడుతుంటాయి. అందుకేనేమో మేము రాజ్యాంగానికి నాలుగో స్థంబం అని చేప్పే తెలుగు మీడియా నవరంద్రాలు మూసుకుని కూర్చుంది. నాలుగో స్తంభం, నీతి, నిజాయితీ అని తెగ గొప్పలు చెప్పుకునే ఛానళ్ళు (ఒకటి రెండు తప్ప) నోరు మూసుకుని కూర్చున్నాయి. ఇదీ మన మీడియా వీరత్వం......షేమ్....షేమ్.... షేమ్.