ప్రద్యుమ్న ఠాకూర్‌ హత్యకేసులో కొత్త ట్విస్ట్..!

Edari Rama Krishna
గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో సెప్టెంబర్ 8న మృతి చెందిన ప్రద్యుమ్న ఠాకూర్ హత్య పెను సంచలనం రేపింది.  ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకుంది.  గుర్గావ్‌లోని ప్రముఖ ర్యాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సెప్టెంబర్‌ 8న ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమ్న ఠాకూర్‌ కిరాతకంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో ఇప్పుడు సీనియర్ విద్యార్థిని అదుపులోకి తీసుకోవడం గమనార్హం.ప్రద్యుమ్నతో పాటు ఆ విద్యార్థి కూడా టాయిలెట్‌లోకి వెళ్లినట్లుగా కొందరు గుర్తించారని తెలుస్తోంది. సదరు విద్యార్థిని పలుమార్లు ప్రశ్నించారని, అతను మాటలు మార్చినట్లుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే  సీబీఐ అదుపులోకి తీసుకున్న విద్యార్థికి ప్రద్యుమ్న హత్యకు సంబంధం ఏమిటి? ఈ కేసులో అతని పాత్ర ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

 సీబీఐ బుధవారం అతన్ని జువైనెల్‌ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేవలం గార్డెనర్‌కు, టీజర్లకు జరిగిన దారుణం గురించి చెప్పాడంతే’ అని విద్యార్థి తండ్రి తెలిపారు.

కాగా, ఈ కేసులో నిందితులుగా ఉన్నస్కూల్‌ సీఈవో ర్యాన్‌ పింటో, అతని తల్లిదండ్రులు, స్కూల్‌ ఫౌండింగ్‌ చైర్మన్‌ అయిన ఆగస్టిన్‌ పింటో, ఎండీ గ్రేస్‌ పింటోలకు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: