కర్నూలు జిల్లా లో జగన్ కి కలిసి వస్తుందా..!

KSK
ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తన యాత్ర కర్నూలు జిల్లాలో అడుగు పెట్టారు. నిన్న ఉదయం తన యాత్ర ని ఇక్కడ స్టార్ట్ చేసారు జగన్ మోహన్ రెడ్డి. ఉద‌యం ప‌దిగంట‌ల ప్రాంతంలో ముత్యాల‌పాడు బ‌స్టాప్ వ‌ద్ద ప్ర‌జ‌ల‌తో జ‌గ‌న్ మాట్లాడారు. ఆ తరువాత‌, మ‌రోచోట మ‌రో ఇంట‌రాక్ష‌న్‌. ఇలా జ‌గ‌న్ యాత్ర షెడ్యూల్ నడిచింది.

అయితే, క‌ర్నూలు జిల్లాలో సాగ‌బోయే పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌ల నుంచి, ముఖ్యంగా వైకాపా వ‌ర్గాల నుంచి ఏ స్థాయిలో స్పంద‌న వ‌స్తుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తికరంగా మారుతోంది. ఈ జిల్లా లో పర్యటన జగన్ కీ ఆయన పార్టీ కీ చాలా వరకూ కలిసి వచ్చింది అంటున్నారు విశ్లేషకులు. వైకాపా కి కర్నూలు చాలా ప్రత్యేకమైన ప్రాంతం ఇక్కడ దాదాపు 11 అసెంబ్లీ  స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు గెలిచింది ఈ పార్టీ.

2014 ఫ‌లితాల స‌మ‌యంలో క‌ర్నూలు జిల్లా అంతా వైకాపాదే హ‌వా అనిపించింది. కానీ, ఆ ఎన్నిక‌ల ఫ‌లితాలు విడుదలైన త‌రువాత నుంచి పేరున్న నేత‌లు ఒక్కొక్క‌రుగా వైకాపా నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చి, తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచీ వైకాపా కి ఇక్కడ ఇబ్బందులు మొదలు అయ్యాయి.

దాదాపు అందరు నేతలూ టీడీపీ లోకి వెళ్ళిపోతే ఈ ప్రాంతం లో కార్యకర్తల కీ వైకాపా సపోర్టర్ లకీ దిక్కు లేకుండా పోయింది. అన్ని పరిణామాల తరువాత,నంద్యాల ఉప ఎన్నిక తరువాత జగన్ తాజాగా ఈ ప్రాంతం లో అడుగు పెట్టారు. జిల్లా నేతల మధ్య విభేదాలు నిన్న యాత్ర తరవాత జగన్ సెట్ చేసారు. ప్రజలు తమతోనే ఉన్నారు అని చెప్పుకోడానికి సాక్షిగా ఇసకేస్తే రాలనంత మంది జనం ఇక్కడ కనిపించారు. ఈ జిల్లాలో యాత్ర వైకాప శ్రేణులలో కొత్త ఉత్సాహం నింపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: