పాకిస్థాన్ గుండెల్లో పరుగెడుతున్న బుల్లెట్ రైళ్ళు "బలూచ్ స్వతంత్ర ఉద్యమం"

పాకిస్థాన్ లో బలూచ్ స్వతంత్రం కోసం ఉద్యమం ఊపందుకుంది. స్వాతంత్ర పవనాలకోసం బలూచ్ పౌరులు దృఢమైన దీక్ష తీసుకున్నారు. పాకిస్థాన్ అణచివేతను ధిక్కరించటం బహుముఖంగా ప్రయత్నాలు ప్రారంభించారు. తమ సహజ సంపదైన ఖనిజాలను కొల్లగొడుతూ వాతావరణం కలుషితం చేస్తూ పాక్ భూభాగాలను సుసంపన్నం చేసుకొంటూ తమను ధారుణంగా అణచివేయటాన్ని ఇంకే మాత్రం సహించలేమటున్నారు బాలూచ్ ప్రజలు. 


స్వాతంత్రం  కోసం బలూచిస్తాన్‌  లో వెల్లువెత్తుతున్న ఆందోళనను అణిచివేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మళ్లీ గండిపడింది. "వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్" మరో సారి భారీ ఎత్తున ప్రచార ఉద్యమాన్ని లేవనెత్తింది. లండన్‌ లోని ప్రజా రవాణా బస్సు లను తన తాజా ప్రచార అస్త్రాలుగా మలుచుకుంది. "బలోచిస్తాన్‌ కి స్వాతంత్రం కావాలి" అన్న నినాదాలతో పోస్టర్లను బస్సులపై ప్రదర్శిస్తోంది.


పాకిస్థాన్‌ నుంచి స్వాతంత్రం కోసం బలూచిస్థాన్‌ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా "బలూచిస్థాన్‌కు విముక్తి కల్పించండి" అంటూ లండన్‌ ప్రజారవాణా బస్సులపై భారీ పోస్టర్లు దర్శనమిచ్చాయి. దాదాపు వంద బస్సులపై ఈ భారీ పోస్టర్లు అంటించి "వరల్డ్‌ బలూచ్‌ ఆర్గనైజేషన్‌" తన ప్రచారాన్ని ముమ్మరం చేయడం అంతర్జాతీయంగా పాకిస్థాన్‌ ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చింది.


లండన్ వీధుల్లో ప్రభుత్వ బస్సులపై బలోచిస్తాన్ నినాదాలు హల్‌ చల్ చేస్తుండడంతో, పాకిస్తాన్ గుండెల మీద మరోసారి కుంపటి రాజుకుంటోంది. "వరల్డ్ బలోచ్ ఆర్గనైజేషన్" ప్రతినిధి భవల్ మెంగల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా వరల్డ్‌ బలూచ్‌ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూబీవో) కార్యకలాపాలను నిషేధించేందుకు పాక్‌ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ఏకంగా లండన్‌లోని ప్రజారవాణా బస్సులపై ఈ భారీ పోస్టర్లు దర్శనమివ్వడంతో పాక్‌ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నట్టు, గుండెలపై ఫిరంగులు పేలుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు "డబ్ల్యూబీవో" ఈ ప్రచారాన్ని ఆపే ప్రసక్తి లేదని తెగేసి చెప్తోంది.


"బలోచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘన కు పాల్పడుతున్న పాకిస్తాన్‌ పై అవగాహన కల్పించేందుకు లండన్‌లో మూడవ దశ ప్రచార ఉద్యమం చేపట్టాం. బలోచ్ ప్రజల స్వీయ నిర్ణయ హక్కు ను కాలరాస్తున్న పాకిస్తాన్‌ చర్యలను ఎండగడతాం. తొలుత మేము టాక్సీలపై ప్రకటన లతో ప్రారంభించాం. అనంతరం రోడ్డు పక్కన హోర్డింగు (బిల్‌బోర్ట్స్‌) లపై ప్రచారం చేశాం. ఇప్పుడు లండన్ బస్సు లపై ప్రచారోద్యమాన్ని చేపట్టాం" అని పేర్కొన్నారు. గతంలో డబ్ల్యూబీవో ఇదేవిధంగా ట్యాక్సీలపై నిర్వహించిన ప్రచారంపై పాకిస్థాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజా ప్రచారంపై ఆ దేశం ఎలా స్పందిస్తుందో చూడాలి.


గతంలో చేపట్టిన ప్రచారం ఉద్యమం సందర్భం గానూ పాకిస్తాన్‌ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా ఈ ప్రచారంలో చెబుతున్నవన్నీ "అబద్ధాలు మాత్రమే" ననీ,  ఇది "పాకిస్తాన్ వ్యతిరేకుల" కుత్ర పూరిత ప్రచారమని పాక్ అధికారులు మళ్లీ పాత పాటే అందుకోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: