'పద్మావతి'తో శాంతి భద్రతల సమస్య...కేంద్రానికి యూపీ లేఖ..!

Edari Rama Krishna
బాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన చారిత్రాత్మక చిత్రాలు అందించిన సంజయ్ లీలా బన్సాలీ  ‘పద్మావతి’ లాంటి చారిత్రాత్మక చిత్రంతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.   ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఎన్నో వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా సంజయ్ లీలీ భన్సాలీ లేటెస్ట్ మూవీ పద్మావతి మూవీ రిలీజైతే అది తీవ్ర శాంతి భద్రతల సమస్యగా మారొచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేంద్రాన్ని హెచ్చరించింది. బన్సాలీ 'పద్మావతి' చిత్రం విడుదలను అడ్డుకుంటామని ఇప్పటికే ఆందోళన బాట పట్టిన రాజ్‌పుత్ కర్ణిసేన డిసెంబర్ 1న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది.

పద్మావతి చలనచిత్ర విడుదలపై ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు గురువారం లేఖ రాసింది. ప్రజలు వ్యతిరేకిస్తున్న చిత్రానికి ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించాలని కోరింది. పద్మావతి చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని సెన్సార్‌ బోర్డు పరిశీలించాలకే తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

పద్మావతి చిత్రం విడుదలను అడ్డుకుని తీరుతామని స్థానికంగా మంచి పట్టున్న బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం హెచ్చరించారు. అటు సినిమాను ప్రదర్శించే థియేటర్ల యజమానులకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అందులో చెప్పింది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని సీబీఎఫ్‌సీకి జాగ్రత్తలు పాటించాల్సిందిగా సూచించాలని యూపీ ప్రభుత్వం కోరింది.

ఇక నవంబర్‌ 22, 26, 29 తేదీల్లో యూపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వీటికి డిసెంబరు 1న కౌంటింగ్‌ను నిర్వహించనున్నారు. ఇలాంటి కీలక సమయంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉందని అరవింద్‌కుమార్‌ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: