ఏపీలో అవకాశాలు అదరహో అంటున్న కొరియా కంపెనీలు..!

siri Madhukar

ఆంధ్రప్రదేశ్ కు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే కియా మోటార్స్ తో ముడిపడిన బంధం మరింత ధృడంకాబోతోంది. లేటెస్టుగా దక్షిణ కొరియా వాణిజ్య బృంద సభ్యులు గుంటూరులో వ్యాపారవర్గాలతో సమావేశమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ తో వ్యాపారబంధాన్ని ధృఢం చేసుకునేందుకు ప్రయత్నిస్తామని దక్షిణ కొరియా టీమ్ చెబుతోంది. ఏపీలో వివిధ రంగాల్లో పెట్ట్టుబడులకు అపార అవకాశాలున్న విషయాన్ని గుర్తించామంటున్నారు కొరియన్ వ్యాపారవేత్తలు.


ఆంధ్రప్రదేశ్ లో వ్యాపార అవకాశాలను పరిశీలించేందుకు కొరియా వాణిజ్య బృందం గుంటూరులో పర్యటించింది. గుంటూరుకు చెందిన చుక్కపల్లి సురేష్ ఈ మధ్యనే కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ గా నియమితులయ్యారు. ఆయన నేతృత్వంలో గుంటూరులో స్థానిక వ్యాపార వేత్తలతో సుహృద్భావ సమావేశం ఏర్పాటు చేశారు. కొరియా దక్షిణ భారత కాన్సులేట్ జనరల్ హంగ్ టి కిమ్ తో పాటు.. 20మంది కొరియా ఇండస్ట్రియలిస్టుల టీమ్ ఈ సమావేశంలో పాల్గొంది.


గుంటూరు నుంచి.. పొగాకు, పత్తి, మిర్చి కొరియాకు ఎగుమతి అవుతోంది. ఆ రంగాలకు చెందిన వ్యాపారులు కూడా సమావేశానికి వచ్చారు. ఏపీతో వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి ప్రయత్నిస్తున్నామని హంగ్ టి కిమ్ తెలిపారు. అంతేకాదండోయ్... గుంటూరులో కొరియా సాంస్స్కృతిక కేంద్రాన్ని కూడా స్టార్ట్ చేస్తారట.


మొత్తం ఇండియాలో 60వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలని దక్షిణ కొరియా డిసైడ్ అయ్యిందట. అందులో ఎక్కువ భాగాన్ని ఏపీకి తీసుకురావాలని ఏపీ టీమ్ ప్రయత్నిస్తోంది. ప్రత్యేకించి ఏపీకి చెందిన సాఫ్ట్ వేర్ హ్యామన్ రిసోర్సులను వాడుకోవాలని కోరియన్స్ భావిస్తున్నారు. అలాగే ఏపీ టూరిజంపైనా వారు ఆసక్తిగగా ఉన్నారట. నౌకా నిర్మాణం, మరమ్మత్తుల రంగంలో అనుభవం ఉన్న కొరియా ఏపీ తీర ప్రాంతంపైనా దృష్టి సారించాలన్నారు. ఓవరాల్ గా చూస్తే ఏపీ-కొరియా బంధం కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: