ఆ రాజగురువును టచ్ చేసే సీన్ ఈ చంద్రులకు ఉందా..?!

KSK
ఆంధ్రరాష్ట్రం విడిపోయాక  చాలామంది  రాజకీయ నేతలు  తమ రాజకీయ హవాని  ప్రక్క పెట్టేశి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు , అయితే మీడియా చక్రవర్తి రాజ గురువైన రామోజీరావు మాత్రం తన హవాని కొనసాగిస్తూనే ఉన్నారు. రాష్ట్రం విడిపోయినా ఆ ప్రభావం తన మీద పడకుండా రెండు రాష్ట్ర రాజకీయాలను  ఇంకా శాసిస్తున్నన్నే ఉన్నారు రామోజీ రావు. సమైక్య రాష్ట్రాన్ని చంద్రబాబు పరిపాలించినప్పుడు ఒక వెలుగు వెలిగినా మీడియా చక్రవర్తి. తర్వాత కాంగ్రెస్అధికారంలోకి వచ్చాక తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు.

రాజశేఖరరెడ్డి మరణం తర్వాత రాష్ట్రం విడిపో పోవడం ఖాయమని, ఇక రామోజీ  సంగతి ముగిసిపోయిందని చాలామంది అనుకొన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ రామోజీ ఫిలిం సిటీ లేకుండా చేస్తా అని ప్రకటించడంతో వై.యస్ కన్నా కేసీఆర్ తో పోరాటం తప్పదని అనుకున్నారంతా. అయితే ఒక అడుగు వెనక్కి వేయడం అంటే వంద అడుగులు ముందుకు వేయనున్నట్టే, అని నిరూపిస్తూ రామోజీ చక్రం తిప్పారు.

మళ్ళీ తన పూర్వ వైభవాన్ని స్వంతం చేసుకున్నారు. దీనితో శత్రువు కావాల్సిన కేసీఆర్ ఆప్త మిత్రుడు అయిపోయారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యాఖ్యలకు భిన్నంగా వ్యవహరించాడు. ఆంధ్ర రాష్ట్ర విషయానికి  వస్తే  ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు,ఎప్పుడు రామోజీరావుకి విధేయుడే, గత ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి  రావడానికి కూడా రామోజీరావు  ఎంతో దోహదపడ్డారు.

తన చిరకాల శత్రువైన రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా రామోజీ రావు ముందు తగ్గాల్సి వచ్చింది. ప్రత్యర్థి కన్నా ఒక అడుగు ముందు ఆలోచించడం, అనూహ్య మైన వ్యూహాలతో పని చేయడం రామోజీ బలం. సాక్షి పత్రిక వచ్చిన కొత్తలో ఈనాడు కొన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తిరిగి ఎవరూ అందుకోలేనంత ఎత్తు లో ఈనాడును నిలబెట్టగలిగారు.  ఇక కథ ముగిసిపోయింది అనుకున్న టైం లో కెసిఆర్ ని తన వైపు తిప్పుకుని తన రేంజ్ లో తెరాస ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ మీడియా లో తాను ఎన్ని రాజకీయాలు చేస్తే ఈ స్థాయికి వచ్చానో అర్ధం అయ్యేలా చేస్తున్నారు రామోజీరావు. కథ ముగిసిపోలేదు అనీ తానే కథ నడిపించే వాడిని అని ఎప్పటికప్పుడు నిరూపించుకోవడం లో గత నాలుగు దశబ్దాలు గా రాజగురువు అనిపించుకుంటూ వస్తున్నారు రామోజీ. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: