తమిళనాడు సీఎం ఖుషీ..ఖుషీ..అందుకేనా..!

siri Madhukar
తమిళనాడులో  రాజకీయ రగడ ఏ రేంజ్ లో కొనసాగుతుందో కొత్త గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పన్నీర్ సెల్వం, శశికళ వర్గానికి రాజకీయ యుద్దం కొనసాగింది.  చివరికి శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలుకు వెళ్లాల్సి వచ్చింది.  అప్పటి నుంచి ఆమెకు ఎదురుదెబ్బలు తగులుతూ వస్తున్నాయి. తాజాగా తమిళనాడులో శశికళ వర్గానికి మరో ఎదురుదెబ్బ తగిలింది.  అన్నాడీఏంకే రెండాకుల గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం స్పష్టతనిచ్చింది.

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వర్గానికే రెండు ఆకుల గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది.జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో వర్గపోరు తలెత్తింది. శశికళ,పన్నీర్‌సెల్వం వర్గాలుగా విడిపోయి.. అధికారం కోసం తీవ్ర యత్నాలు చేశారు.  అంతే కాదు  పళనిస్వామి, పన్నీర్‌సెల్వం ఒక్కటై శశికళను, ఆమె మేనల్లుడు దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ మద్య రెండాకుల గుర్తును తమకే కేటాయించేలా ఎన్నికల సంఘంలోని ఓ అధికారికి లంచం ఇచ్చేందుకు యత్నించి దినకరన్‌ దొరికిపోవడం తీవ్ర సంచలనం సృష్టించింది.

తాజాగా అన్నాడీఎంకే పార్టీ రెండాకుల చిహ్నం, పార్టీ జెండా తమ వర్గానికి రావడంతో తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయం, ధర్మం విజయం సాధిస్తోందని తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి చెప్పారు. అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం మా సొంతం అయినందుకు చాల ఆనందంగా ఉందని చెప్పారు.   

పార్టీని సొంతం చేసుకోవడానికి నిజాయితీగా 90 శాతం మంది పార్టీ కార్యకర్తల సహకారం తీసుకున్నామని ఎడప్పాడి పళనిసామి వివరించారు. కాగా, 2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత మరణించడం, సీఎం పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం చిన్నమ్మ శశికళ మీద తిరుబాటు చెయ్యడంతో అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్కలు అయిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: