ప్రభుత్వం చేసిన దుబారా వ్యయంపై కేంద్రం దృష్టి - బహుశ అదే బాబు భయానికి కారణమా?

వ్యాపారం చేసేవాళ్ళు మూలధనం కోసం, రోజువారి వ్యాపార అవసరాలకోసం, ఆస్తులు కొనడం కోసం, ఆదాయం పెంచు కోవడానికోసం కొత్త మౌలిక వసతులు పెంచు కోవటానికి  మాత్రమే అప్పులు చేస్తారు.  కానీ అప్పులు చేసి ఆ సొమ్ముతో ఎడాపెడా దుబారా చేయటం, డంబాలు, దర్పాలు జల్సాలు చేసే వ్యాపార సంస్థలైనా కుటుంబా లైనా దివాళా  తీస్తారని చెప్పడానికి చాణక్యుని ఆర్థశాత్ర సూత్రాలు బట్టీయం  పట్టనక్కరలేదు. 


రాష్ట్రానికి పెద్ద దిక్కైన ముఖ్యమంత్రి అప్పులు చేస్తున్నారని అన్టే తాని ఎన్ని ఆలోచించి ఉంటారని అనుకుంటాం?  అందులోనూ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మంచి ‘అనుభవజ్ఞుడు’ కాబట్టి చాలా ఆలోచించి, సంపదలు సృష్టించడానికి, ఆదాయం కొన్ని రెట్లు పెంచడానికి కావలసిన మౌలిక వనరులు సృష్టించ టానికి మాత్రమే అప్పులు చేస్తున్నారని ప్రజలంతా అంతా భావిస్తున్నారు. కానీ నిప్పులాంటి  ముఖ్యమంత్రి ఇంత ధారుణంగా “పప్పులో కాలేసినట్లు తేలిపోయింది” 



తమిళ నాడు నుండి విడివడి తెలుగు బాషా ప్రాంతమంతా తెలంగాణాతో కలుపుకొని సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్  రాష్ట్రం  ఏర్పడిన 1956 నుంచి 2014 వరకు చేసిన అప్పుల కంటే విభజన తర్వాత ఈ మూడున్నరేళ్లలో  ఆంధ్రప్రదేశ్‌ చేసిన అప్పులు దాదాపు రెట్టింపు అయ్యాయని తెలిస్తే జనం గుండెలు జారిపోతున్నాయి. అంత అనుభవఙ్జుడైన ముఖ్యమంత్రి రాష్ట్రం షష్టి పూర్తి కాలంలో చేసిన ఋణం ఒక్క మూడున్నరేళ్లలో అదీ రెవెన్యూ వ్యయం చేయటం పై ప్రజలేకాదు దేశం మొత్తం ఆశ్చర్యపోతుంది.  


అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఇంత అప్పులు చేసి ఆస్తులు కూడబెట్టిందో,  లేక కొత్త రాష్ట్రంలో శాశ్వత భవనాలకు వెచ్చించిందో,  లేదంటే ఆదాయ మార్గాలను సృష్టిం చిందో అనుకుంటే పొరపాటే. ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం లేదు. కట్టిన సచివాలయం, శాసన సభ భవనాలు అన్నీ  తాత్కాలిక నిర్మాణాలే.   అవీ వర్షాలకు చెమ్మ బట్టటం, గోడలు పైకప్పులు బీటలు వారిన వార్తలు కూడా వచ్చాయి. రంకులాడి బొంకులాడదా అన్నట్లు అదంతా ప్రతిపక్షం మీదకు తోసేయటానికి ప్రయత్నించి ప్రభుత్వమే అభాసుపాలైంది.  



రాజధాని నిర్మాణానికి ఒక్క పున్నాది రాయి కాని ఒక్క ఇటుక ఎత్తిందీ లేదు. అసలు డిజైన్ల దశ దాటడానికే మూడున్నరేళ్ళు  చాల లేదు. మరి ఈ కొద్ది కాలంలో  రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని అప్పులు ఎందుకు చేసింది? అప్పు చేసి తెచ్చిన రూ.1.20  లక్షల కోట్లు ఎటుపోయాయి? ఇంత తక్కువ సమయంలో అన్ని కోట్లు ఎలా ఖర్చు చేశారని తెలుసుకోవట చాలా అవసరం.   


 
రాష్ట్ర విభజన తరువాత 2014 జూన్‌ లో అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన నాటి నుంచి 2017 సెప్టెంబరు వరకు మూడున్నర ఏళ్ల లో తెలుగుదేశం ప్రభుత్వ హయాములో కొత్తగా రాష్ట్ర ప్రజలపై పడిన ఋణభారం మరో రూ. లక్ష ఇరవై వేల కోట్ల రూపాయిలు. (రూ.1,20,611 కోట్లు) ఇన్ని అప్పులు చేసి ఒక్కటన్నా ప్రోజెక్ట్ కట్టారా?  నూతన మౌలిక వసతులు పెంచు కున్నారా?  ఆస్తులు పెంచారా అంటే అదీ లేదు. ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా దుబారాలకు, ఈవెంట్ నిర్వాహక సంస్థలకు విచ్చలవిడిగా ఆడంబ రాలకు వెచ్చించడంతో,  తెచ్చినవన్నీ తరిగిపోవడంతో రెవెన్యూ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఇది రూ.73,135 కోట్లకు చేరుకుందంటే దుబారా ఆదంబరాలు ఏస్థాయికి చేరుకున్నయో  అర్ధమౌతుంది.   




మిగిలిన రూ.47,476 కోట్లనయినా ఆస్తులు పెంచడానికి, ఆదాయమార్గాలను సృష్టించడానికి వెచ్చించారా అంటే అదీ లేదు. అన్నీ తాత్కాలిక నిర్మాణాలు. వాటితోపాటు పాత ప్రాజెక్టుల పనుల్లో (జీవో నంబర్‌ 22 ద్వారా) భారీగా అంచనాలు పెంచి కాంట్రాక్టర్ల ద్వారా సాగించిన దోపిడీ మాత్రమే కనిపిస్తున్నాయి. చేసిన అప్పుల్లో సగం కూడా నిర్మాణాత్మకంగా ఖర్చు చేసినట్టు కానరావటం లేదు. 1956–2014 మధ్య కాలంలో రాష్ట్రప్రభుత్వాలు చేసిన అప్పుల్లో 87 శాతం ఆస్తుల కోసం ఖర్చు చేశారు. మిగిలిన 13 శాతం కూడా చంద్రబాబు నాయుడు గతంలో చేసిన 9 ఏళ్ల పాలనలో ఆయన ప్రభుత్వం వల్ల సంక్రమించిన రెవెన్యూ లోటు (రూ.22,126 కోట్లు) తీర్చటానికే ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు మూడున్నరేళ్ల పాలనలో తెచ్చిన అప్పుల్లో 39 శాతం మాత్రమే పెట్టుబడి వ్యయం (క్యాపిటల్‌ ఖర్చు)  క్రింద  ఖర్చుపెట్టి, మిగిలిన 61 శాతం రెవెన్యూ లోటు భర్తీ కోసం వెచ్చించారు. 



బహుశ ఇదంతా నిఘా వ్యవస్థల ద్వారా కేంద్రానికి తెలిసిందని అంటున్నారు. అందుకే రాష్ట్రానికి ఏదైనా ఆర్ధికసహాయం చేస్తే ఇలా వృధా అయిపోవటంతప్ప మరేప్రయోజనం సిద్ధించేఅవకాశం ఉండకపోవటం కేంద్రప్రభుత్వం గుర్తించిందంటున్నారు మరి మున్ముందు ఏమి జరుగుతుందో చూడాలని జనం అనుకునేది పోలవరం ప్రోజెక్ట్ నిర్మాణం ద్వారా ట్రాన్స్-ట్రాయి లాంటి కంపనీ తో కుమ్మక్కై విపరీతంగా అంచనా వ్యయం పెంచేసి ప్రభుత్వంలోని ప్రముఖులే పోలవరాన్ని దోచేస్తున్నారని భారత్ ఆసేతు శీతాచలం భావిస్తున్నట్లు వింటున్నాం. (ఖర్చు చేసిన విధానం మరో వ్యాసంలో)  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: