పవన్ కళ్యాణ్ ఒంగోల్ సభ గందరగోళం - అఖిల ప్రియని టార్గెట్ చేశారా?

పవర్ స్టార్, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఒంగోలు లోని  "ఎ-వన్ కన్వన్షన్‌ హాలు" లో శనివారం నిర్వహించిన సభ అంతా గందరగోళం మధ్యనే జరిగింది. ఎవరు ఏం మాట్లాడు తున్నారో అర్ధంకాని అయోమయ పరిస్ధితి ఏర్పడింది.  ఎ-వన్ కన్వన్షన్‌ హాలులో పరిమితికి మించి పవన్ కళ్యాణ్ అభిమానులు, రాజకీయనాయకులు, కార్యకర్తలు హాజరుకావటంతో ఒక్కసారిగా హాలు లో గందరగోళం నెలకొంది. 


అభిమానులు ముందుకు దూసుకుంటూ వేదిక పైకి దూసుకుని వచ్చారు. ఈ సమయంలో కన్వన్షన్‌ హాలు లో ఆక్సిజన్ అందక కొంతమంది పవన్ కళ్యాణ్  అభిమానులు పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రసంగం మధ్యలో నే ప్రాణభయంతో బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. కొద్దిమందికి మాత్రమే సభకు అనుమతి ఉందని నిర్వాహకు లు ముందుగా ప్రకటించి నప్పటికీ వారి అంచనాలు మించి కార్యకర్తలు రావటంతో తోపులాట జరిగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశంతో సమస్య కొంత సద్దుమణిగింది. 


ఇది ఇలాఉండగా "కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్" అంటూ అభిమానులు, జనసేన కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిం చారు. కాని వారిని పవన్ కళ్యాణ్ సున్నితంగా మందహాసంతో మందలించారు. ఆయన చిరుదరహాసం వారి హోరెత్తించే నినాదాలని ఆపలేక పోయాయి. కాగా పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే ప్రసంగించారు తప్ప ఏ ఒక్క కార్యకర్తకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోగా కనీసం అభిమానులతో ముచ్చటించటం కాని, దగ్గరకు ఆహ్వానించటం కాని జరగక పోవటంతో అభి మానులు, కార్యకర్తలు తీవ్ర నిరాశ పడ్డారు. 


సూదూర ప్రాంతాలను అభిమానులు భారీగా తరలివస్తే కనీసం వారిని ఆప్యాయంగా పలకరించలేదన్న వాదన వారినుండి వినిపించింది. ఇదిలాఉండగా పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంపై సున్నితంగా విమర్శలు గుప్పించారు. ప్రధానంగా రాష్ట ప్రర్యాటక శాఖమంత్రి అఖిలప్రియ లక్ష్యంగా బోటు ప్రమాద బాధితుల సమావేశంలో విమర్శిం చారు. బాధితులను పరామర్శ కూడా చేయకపోవటం అన్నిటి కంటే పెద్ద తప్పంటూ మంత్రి అఖిల ప్రియ పై ఆరోపణలు చేశారు.


తన విమర్శలను సద్వివిమర్శలుగా తీసుకోవాలని మంత్రికి స్వాంతన పలికారు. ఎక్కడో రైలుప్రమాదం జరిగితే ఆ సంఘటన పట్ల నాటి రైల్వే మంత్రి లాల్‌ బహుదూర్ శాస్త్రి తన పదవినే పరిత్యజించారని అంటూనే మంత్రి అఖిల ప్రియ మాత్రం రాజీనామా చేయాల్సిన పని లేదంటూనే దెప్పి పొడిచారు. అదే విధంగా ప్రత్యేక హోదాపై కూడా ఆయన తన దైన శైలిలో మాట్లాడారు.


కేంద్రంలోని బిజెపి, తాను మద్దతు తెలుపుతున్న తెలుగు దేశం, ప్రతిపక్ష పార్టీ అయిన వైసిపిల విధానాలపై కూడా విమర్శిం చారు. ప్రత్యేక హోదా పై ప్రజలు నడిరోడ్డు పైకి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. కులాల కుమ్ములాటల విషయాలపై కూడా ఆయన ఘాటు గానే స్పందించారు. పక్క రాష్టం తెలంగాణలో కులరాజకీయాలు లేవని, ఇక్కడమాత్రం ఉన్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.



ఇది ఇలా ఉండగా రానున్న ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేస్తామని ప్రకటించటంతో రాజకీయ నిరుద్యోగుల్లో కొంత ఊరట కలిగిం దనే చెప్పవచ్చు. రానున్న ఎన్నికల్లో కొత్తవారి కి అవకాశాలు రానున్నాయి. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ తరుపున ఈపాటికే సభ్యత్వ నమోదు చేసుకున్న వారికి అవకాశం కలుగుతుందా? కొత్త సుసంపన్నులు రంగం లోకి వస్తారా?  అన్న చర్చ ఆయన ప్రసంగం నుండే వినిపిస్తోంది.
 
ఈ విషయంతో జిల్లాలో మరికొంత మందికి రాజకీయ వేదిక దొరికే అవకాశం లభించినట్లే ఉంది. కాగా పవన్ కళ్యాణ్ జిల్లా పర్య టన విజయవంతం కావటం తో జనసేన పార్టీ  కార్యకర్తలు ఆనందంలో ఉన్నారు. కాగా పవన్ కళ్యాన్ సభలో మాత్రం గందర గోళ పరిస్ధితులు చక్కబెట్టడటంలో నిర్వాహకులు పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పవన్ పర్యటన సందర్భంగా భారీగా పోలీసులను మోహరించారు. ముందుగా ఎన్‌టిఆర్ కళాక్షేత్రం నుండి బయలుదేరిన కాన్వాయ్‌ లో పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: