అమెరికాలో ఉగ్రదాడి..!

siri Madhukar
గత కొంత కాలంగా అమెరికాలో వరుసగా బాంబు దాడులు, కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు ఉగ్రవాదులు.   అమెరికాలోని మన్‌హట్టన్‌లోని ఓ బస్ టెర్మినల్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ఆత్మాహుతి దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.   మన్‌హట్టన్‌ 42వ వీధిలోని ఎనిమిదో అవెన్యూ బస్ టెర్మినల్ వద్ద ఈ దాడి జరగ్గా, పేలుడు అనంతరం ఆ సమీపంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న వ్యక్తిని గుర్తించిన పోలీసులు అతడి దగ్గరికి వెళ్లి చూడగా అనుమానాస్పదంగా కనిపించాడు.

ఈ ఘటనతో న్యూయార్క్‌లో హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు.  పేలుడు సమయంలో తొక్కిసలాట చోటు చేసుకొంది. దీంతో 42 అవెన్యూ వద్ద ప్రజలను  పోలీసులు ఖాళీ చేయించారు. న్యూయార్క్‌లో బాంబు పేలుడుకు పాల్పడిన వ్యక్తిని బంగ్లాదేశ్‌కు చెందిన అఖాయెద్‌ ఉల్లాగా పోలీసులు గుర్తించారు. ఉల్లా తాను పనిచేస్తున్న ఎలక్ట్రిక్ కంపెనీలో బాంబును తయారు చేసినట్టు విచారణలో వెల్లడైంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సోమవారం ఉదయం జాకెట్‌లో బాంబు పెట్టుకుని బస్ టెర్మినల్ వద్దకు చేరుకున్న ఉల్లా బాంబును పేల్చడం విఫలమయ్యాడు.

దీంతో బాంబు సరిగా పేలలేదు సరికదా, ఉల్లా గాయపడ్డాడు. ఈ ఘటనలో గాయపడిన  ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడి ఘటనతో వెంటనే పోలీసులు, వైద్య బృందాలు, అగ్నిమాపక దళాలు, పోర్ట్ అథారిటీ ఉగ్రవాద నిరోధక అధికారులు అక్కడకు వచ్చి పరిస్థితిని సమీక్షించారని చెప్పారు. ఘటనలో నలుగురికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: