గంగలో కలసిన పవన్ కళ్యాణ్ పరువు ప్రతిష్ట - బండ్ల, రోజా మద్యలో టివి-9

పవన్ కళ్యాణ్ అనేక విషయాలపై ఏకబిగిన ఉపన్యాసమిస్తారు. విషయంలో విశేషాలు సరిగా లేకపోయినా కొన్నివిషయాల్లో మాత్రం చాలా నిక్కచ్చిగా ఉండాలనుకుంటారు. టాలీవుడ్ కథానాయకునిగా మాత్రమే కాకుండా తన స్వంత జనసేన పార్టీ అధినేతగా, రాజకీయాల్లో కొనసాగుతున్న రాజనీతిఙ్జునిగా తనకంటూ, తన అనుయాయులకూ కొన్ని నియమ నిబంధనలు పెట్టుకున్నారు. 



హేతుబద్ద విమర్శలు చేయాలని, అసహ్యకర పదజాలం (బూతులు) మన ఉపన్యాసాల్లో కాని సంవాదాల్లో కాని వాడకూడదని తనకు తానే నిర్ణయించుకున్నారు, తన వార్కి కూడా అదే చెప్పారు. కానీ ఇది ప్రజాస్వామ్యం అందులో రాజకీయం. పవన్ కళ్యాణ్ ఎంతగొప్పగా ఉండాలనుకున్నా, మిగతా వాళ్లు అలా ఉండనీయరు. జనసేనానికి కూడా బూతులు ఆపాదిస్తారు, ఆయనకు ఈ కుళ్ళు, మురుగు కూడా పూసేస్తారు. 


నిన్న రాత్రి జరిగిన టివి 9 ఇష్టా గోస్ఠిలో చర్చా కార్యక్రమంలో అంటే బూతు కార్యక్రమమలో బూతు సార్వభౌముడు నిర్మాత బండ్ల గణేశ్, ఎమ్మెల్యే కథానాయకి ఇప్పుడు నటి భూతు విప్లవ నారి రోజా మధ్య చర్చా కార్యక్రమం చూస్తే "పాపం! పవన్ కళ్యాణ్" అని ప్రతి ఒక్కరి మనసంతా వికలమైంది. తనకు ఈ చర్చకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య పడి పవన్ సాండ్-విచ్  అవటమే కాకుండా పరువు పోగొట్టుకోవటమే కాకుండా అప్రతిష్ట పాలయ్యాడు. తన అభిమాన కథా నాయకుడు పవన్ కళ్యాణ్ణి అమితంగా ఆరాధించే బండ్ల గణేష్ ఆయన్ని పొగిడే క్రమంలో, రోజాను రెచ్చగొట్టి ఆమెతో పవన్ కళ్యాణ్ ను నానా దుర్భాషలాడించాడు. 


"మీది గోల్డెన్ లెగ్. దేశం మొత్తం మీగురించి కోడై కూస్తోంది. ఎప్పుడూ జగన్ తోనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మా మహా తల్లి! గొప్ప నాయకులు మీరు. వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా పైకి పంపించారు. మీరు ఎప్పుడూ అక్కడే ఉండాలి" రోజాను తిడుతూ - "కోతి పుండు బ్రహ్మ రాక్షసి" అని రోజా తిట్ల నైపుణ్యం మరచిపోయి దేహంపై స్పృహ కోల్పోయిన బండ్ల గణేష్ రెచ్చగొట్తారు. 


"ఏం మాట్లాడుతున్నావ్! నువ్వు పక్క నుండి పక్కలేస్తున్నావా! పవన్ కల్యాణ్ కు. పళ్లు రాలిపోతాయ్ జాగ్రత్త!" అసలే పవన్ పై మండిపడుతున్న రఒజా అనే అగ్నికి ఆజ్యాం పోసిన బండ్ల గణేశ్ కు రోజా ఘాటైన ప్రతిఘటనాత్మక సమాధానం ఇది.  రెండు సంభాషణలతో మొత్తం దృశ్యం జనాలకు అర్ధమైంది. "రాజకీయాల్లో వారసత్వం వద్దు!" పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో అన్న ఒకే ఒక్క మాటకు బండ్ల గణేశ్, రోజా కలిసి ఒకరినొకరు మద్యలో పవన్ ను గెలికేశారు. ఆ మాటల మద్యలో "పవన్ దొడ్డిదారిన రాజకీయాల్లోకి వచ్చాడా? నువ్వు హీరోయిన్ గా స్ట్రయిట్ గా వచ్చావా. నాకు తెలీదా!" అంటూ బండ్ల గణేష్ మరింతగా రెచ్చి పోయారు.



మొత్తమ్మీద బండ్ల గణేశ్, రోజా మధ్య వ్యక్తిగతవిభేదాలకు పవన్ కళ్యాణ్ ధారుణంగా బలైపోయాడు. తనకు ఏమాత్రం సంబం ధం లేని చర్చా వేదిక పై అవమానకరంగా నలిగిపోయాడు. నిజానికి ఇటు బండ్ల గణేశ్, అటు రోజాపై పవన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అందరికీ ఆమోదయోగ్యమైన ఓ ఓపెన్ స్టేట్ మెంట్ మాత్రం ఇచ్చారు. కానీ సదరు ఛానెల్ మాత్రం ఎవరైతే బాగా తిట్టుకుంటారో అలాంటి వాళ్లను పిలిచి మరీ పవన్ ను కావాలనే అప్రతిష్టపాలు చేసిందా? అని ప్రజలు అనుకుంటున్నారు.


ఈ రోజా గణేష్ ల సంవాదం చిత్ర సీమను ఒక సారి బురదలోకి నెట్టింది. అటు నిర్మాత ఇటు నటి మద్యలో కథానాయకుడు ఈ కథ చూస్తే "మీ..టూ" అనేకమంది నటీమణులు ప్రపంచ వ్యాప్తంగా బయతపెట్టే విషయాలు నిజమా? టలీవుడ్ దానికి ఎక్సెప్షన్ కాదా? ఇలాంటి అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. మొత్తం మీద బండ్ల గణేష్ రోజా అన్నట్లు పవన్ సేవలో తరించిపోతున్నాడా? అనే అనుమానం కలుగుతుంది జనాలకి.    


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: