సొమ్ము మీరివ్వండి సోకు మేము చేసుకుంటాం! ముఖ్యమంత్రుల తీరుతో నిధులివ్వని కేంద్రం

"సొమ్మొకడిది సోకొకడిది" అన్నట్లు అధికారములో ఉన్నవాళ్ళు ప్రజలు కట్టినపన్నులతో నడిచే పలుప్రభుత్వ కార్యక్రమాలకు తమపేర్లు పెట్టి ప్రచారంపొందుతున్నారు  ఉదాహరణకు తెలంగాణాలో 'కెసిఆర్ కిట్' ఆంధ్రాలో చంద్రన్నభీమా మొదలైనవి. తమిళనాడులో అయితే అంతా అమ్మ మయం. సర్వం ఈ నాయకులే ఇచ్చినట్లు చెప్పు కొని ప్రచారార్భాటం చేసి ఎన్నికల్లో గెలుస్తారు. ప్రజాధనం తో నిర్వహించే పథకాలకు నాయకుల పేర్లెందుకు? ముఖ్యమంత్రి కిట్ అని బ్రాండ్ చెయ్యండి అంటున్నారు ప్రజలు



ఖర్మేమంటే కెంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా రాష్ట్రాల్లో వీళ్ళపేర్ల తోనే "బ్రాండ్ బిల్డ్" చేసుకొని ఇందులో కూడా "ప్రచార చిలక్కొట్టుడు" ప్రారంభిస్తారు. నిజంగా అయితే ఇది పెద్ద దుర్మార్గం. చెసేదొకడు అనుభవించేదొకడు. రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇల్లు, లాంటి పథకాలు వ్యక్తిపూజకి పెద్ద ఉదాహరణలు. దేశ అధినేతలు వారి మరణా నంతరం వారి వారసులు అనుయాయులు ఇలాంటి పథకాలకు వారి పేర్లు పెట్టారంటే వారి స్మ్రుతి-చిహ్నంగా ఒక పథకానికి ఆ పేరు పెట్టారని వారి తపనను అర్థం చేసు కోవచ్చు.


తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబులు స్వయంగా ఇప్పుడే తమ పేర్లతో పథకాలను బ్రాండింగ్ చేయటాన్ని ఎలా సమర్ధించాలి.   ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమ రచన, అమలు, ప్రచారం లో ముందున్నారు. అటు కేంద్రం సొమ్ముతో నడిచే పథకాలకు ఇటు రాష్ట్ర పథకాలకు ఆయన తన పేరుతో బ్రాండ్ బిల్డ్ చేసుకొని కేంద్ర పేరును కూడు కబ్జా చేసేస్తున్నారు. 


చంద్రన్న బీమా, చంద్రన్న కానుక, చంద్రన్న సంచార చికిత్స సేవ, చంద్రన్న వ్యవసాయ క్షేత్రం, చంద్రన్న ఉద్యోగ మేళా, చంద్రన్న విలేజ్ మాల్ (చంద్రన్న రేషన్ దుకాణాలు) ఇలా పలు పథకాలకు ఆయన సొంత సొమ్మేదో ప్రజలకు ఖర్చు పెడుతున్నట్లు బ్రాండ్ వేసు కొవటమంత దరిద్రం మరేదీ ఉండదని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది చూస్తుంటే బ్రతికుండ గానే తన సమాధి తాను కట్టు కున్న మొగలాయీల తీరులా ఉంది. ఇంకా ఒకటీ అరా పథకాలు ఏవైనా మిగిలి ఉంటే చంద్ర బాబు ఆ పథకాలకు ఎన్ టి ఆర్ పేరుతో బ్రాండ్ బిల్డ్ చేయటం ఆనవాయితీగా మారింది. ఎన్ టి ఆర్ ఆరోగ్య సేవ, ఎన్ టి ఆర్ భరోసా, అన్న క్యాంటీన్లు ఇలాగు న బ్రాండ్ బిల్డ్ చేసేస్తారన్న మాట. ఇక కేసిఆర్ స్వంత చానల్ నుండి వార్తలు "అన్న బతకమ్మకు అన్నికోట్లిచిండు, యాదవ కురుమ బ్రహ్మణ కులజనుల అభివృద్దికి ఇన్ని కోట్లిచ్చిండు"  అని అంతులేని ప్రచారం చేసుకుంటాడు.



అత్యంత విచారకర విషయం ఏమిటంటే దాదాపు ఆరు దశాబ్ధాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీకి పేర్లు చెప్పుకోవడానికి నెహ్రు, ఇందిరా, రాజీవ్ మాత్రమే కనిపిస్తుంటే, ఉభయ తెలుగు రాష్ట్రంలో పాతికేళ్ళకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి ఎన్ టి ఆర్, చంద్రబాబు పేర్లే దిక్కుగా మారాయి. తెలంగాణాలో మాత్రం కేసిఆర్ పేర్లతో రాజకీయ పార్టీలు ప్రజాధనాన్ని తమ కుటుంబ స్వంత సంపదలైనట్లు పథకాలకు ప్రోజెక్ట్ లకు ఇతర ఎన్నో కార్యక్రమాలకు తమ పేర్లు పెట్టుకొని కీర్తిని కబ్జా చేసేస్తున్నారు.

మెట్రో రైలును, ఇందిరా రాజీవ్ లు ప్రారంభించిన ఐటిని నేనే ఈ దేశానికి,  అక్కడ సత్యనాదేళ్ళకు నేర్పాననే చంద్రబాబుకు ఈ "దుగ్ధ మరీ ఎక్కువ" అందుకే కేంద్రం సొమ్ములతో ఏర్పాటైన కేంద్ర పథకాలకు తన పేర్లు పెట్టి  "సొమ్మొకడిది కీర్తి మరొకడి ది"  లాగా తయారు చేయటంతో 'మనకు పేరు తీసుకురాని పథకాలకు మనమెందుకు నిధులివ్వాలి అనే భావనతో కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ కు నిధులివ్వాలని అనిపించదు' అని కేంద్రంలో ఉన్న ఒక అధికారి అనధికారికంగా చెప్పిన విషయం. 

ఆయన వివిధ కేంద్ర పథకాలకు పేర్లు మార్చేసి తన పేర్లు పెట్టుకున్నారు. వాటిలో ఒకటి చంద్రన్న బీమా. అసలు ఇది "ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబివై)" దానికి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు పేరిట చంద్రన్న బీమా అని బాబు బ్రాండ్ వేసేసుకున్నరు. 


కేంద్ర ప్రచార పథకాలను వివిధ రాష్ట్రాల్లో ప్రచారం  చేయక పోవటం తో తాము చేసిన పనులకు తమకు కాకుండా ఏమీ చేయ ని రాష్ట్రాలకు కీర్తి రావటం సహించలేక పోతున్నారు బిజెపి వాళ్ళు. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తుచేయటం వలననే. బిజెపి చేసిన గెలుకుడుకు జడిసిన చంద్ర బాబు ఆ పథకానికి ముందు ఇంగ్లీష్ అక్షరాలు "పీఎంజేజేబివై" చేర్చి దానికి "పీఎంజేజేబివై-చంద్రన్న బీమా పథకం" అని తన పేరు మాత్రం తీసి వేయకుండా సరిచేసి అలానే ముందుకుపోతున్నారు. బాబా మజాకా? అంటున్నారు జనం.  

అటల్ బిహారి వాజపేయి నాయకత్వంలోని ఎండిఏ ప్రభుత్వం పథకాలకు ప్రధానమంత్రి సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పేర్ల తో పథకాలకు బ్రాండ్ బిల్ద్ చేసే విధానం ప్రారంభించారు. వాజ్పేయీ పాలనా కాలంలో ఏనాడూ ఎప్పుడూ తమ సొంత పేర్లు పథకాలకు పెట్టుకోలేదు. నరెంద్ర మోదీ కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తూ సంప్రదాయంగా మార్చేశారు. 



ఈ మూడున్నరేళ్లలో మొత్తం 80పైగా దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కేంద్రపథకాలను నరెంద్ర మోదీ ప్రారంభించారు. వాటిలో రెండుమాత్రం "దీన దయాళ్ ఉపాధ్యాయ పేరిట" ఒకటి అటల్ బిహారీ వాజ్పేయి పేరుతో ఉంటె మిగిలినవన్నీ ప్రధానమంత్రి పేరుతోనే బ్రాండ్ అయి ఉన్నాయి. అంతే కానీ వేటికీ ఆయన తన స్వంత పేరు పెట్టుకోలేదు. అయినా సొంత సొమ్ముతో ఛారిటీ చేస్తున్నట్టు ప్రభుత్వ పథకాలకు తమ పేర్లు పెట్టుకునే జాడ్యం ఏమిటసలు? 


దీనిపై ఇప్పటికైనా ఒక చట్టం చేయటం అవసరం. లేకుంటే చంద్రబాబు తన కీర్తి దాహంతో ఆంద్ర ప్రదేశ్ ను చంద్ర ప్రదేశ్ గా మార్చేసే ప్రమాధముందని ప్రతిపక్షాలే కాదు ప్రజలంతా ముక్త కంఠం తో ఖండిస్తున్నారు. ఈ యన వ్యవహారాలన్నీ ఇలా తగలడటం గుర్తించిన కెంద్రం రాష్ట్రానికి మొండి చెయ్యి చూపిస్తుందని అంటున్నారు బాజపా వాళ్ళు. పోలవరం కట్టాల్సింది నిధులివ్వల్సిందీ కేంద్రం. దానిపై చంద్రబాబు కీర్తి కోసం పెత్తనం ఎలగబెట్టటం అంతర్గతంగా కేంద్రానికి నచ్చట్లేదని తెలు స్తుంది. బాజపా అధికారంలోకి రాష్ట్రంలో ఎలాగురాదు!  కాబట్టి అసలు సహాయనిరాకరణ చేసేస్తే పోయేదేముండి అని కేంద్రం లోని మోదీ ప్రభుత్వం అనుకొంటూ ఉండొచ్చు.



బహుశ చంద్రబాబును ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పుకుంటే తప్ప కేంద్రం సహాయం చెయకపోవచ్చని అంటున్నారు విఙ్జ్జులు. బాబుకు బదులు ఏ అనామకుడు ముఖ్యమంత్రిగా ఉన్నా బహుశ పోలవరం 'కేంద్రం కీర్తి ఖండూతి' తో నైనా పూర్తి చేస్తూ ఉండేదనిపిస్తుంది. కమీషన్ లు కీర్తి దొరికే చోటికి వాలిపోయేవాళ్ళు --కమీషన్లు, కీర్తి రెండూ కావలని కాసుకొని కూర్చునే వాళ్ళు ప్రజలకు ఏమీచేయలేరు, గడ్డివాము దగ్గర శునకంలా! తాను తినదు వేరొకరిని తిననివ్వదు అన్నట్లు.


కీర్తి కాముక త్రిమూర్తులు 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: