కొత్త నోట్ల కోసం అంత ఖర్చా..!

siri Madhukar
పెద్ద నోట్ల ర‌ద్దు తర్వాత జ‌రిగిన కీల‌క ప‌రిణామాల్లో మ‌రో వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. నోట్లరద్దు తర్వాత కొత్త రూ.500ల నోట్ల ముద్రణకు దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పీ రాధాకృష్ణన్ లోక్‌సభకు తెలిపారు. ఈ మేరకు లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీ.రాధాకృష్ణన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. డిసెంబరు 8 వరకు 1,695.7 కోట్ల కొత్త రూ.500ల నోట్లను ముద్రించినట్లు తెలిపారు. దీని కోసం రూ.4,968.84 కోట్లు ఖర్చే చేసినట్లు తెలిపారు.

ఇప్పటి వరకు రూ.2 వేలు విలువ కలిగిన 365.4 కోట్ల నోట్లను ఆర్బీఐ ముద్రించిందని, ఇందుకు రూ.1,293.6 కోట్లు ఖర్చు చేసినట్టు చెప్పారు. అదేవిధంగా రూ. 200 నోట్ల విషయానికి వస్తే.. రూ.522.83 కోట్లను ఖర్చు చేసి 178 కోట్ల నోట్లను ముద్రించినట్టు వివరించారు. 30 జూన్ 2017 నాటికి బ్యాంకులకు తిరిగి చేరిన రద్దయిన నోట్ల విలువ రూ.15.28 లక్షల కోట్లు అని మంత్రి వెల్లడించారు.ఇటీవ‌ల‌ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8 కన్నా ముందు రూ.2000, రూ.500 నోట్లను ఎంత మొత్తంలో ముద్రించారన్న వివరాలను వెల్లడించేందుకు ఆర్బీఐ నిరాకరించింది.

ఇది సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 8 (1) (ఏ) కిందికి వస్తుందని ఆర్బీఐ అనుబంధ భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ (ప్రైవేట్) లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎల్) పేర్కొన్నది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో.. దేశంలో నోట్ల కొరత ఏర్పడకుండా ఎంత మొత్తంలో కొత్త నోట్లను ముద్రించారో తెలుపాల్సిందిగా ఆర్టీఐ కింద ఒకరు కోరగా, ఆ సమాచారాన్ని సున్నిత కారణాల దృష్ట్యా వెల్లడించలేమని బీఆర్‌బీఎన్‌ఎల్ బదులిచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: