షాక్:అపోలో ఆసుపత్రిలో జయలలిత వీడియో వైరల్..!

Edari Rama Krishna
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై వస్తున్న అనుమానాలపై విచారణ జరుగుతున్న సందర్బంలో అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ వర్గం ఓ సంచలన వీడియో లీక్ చేసింది.   దీంతో తమిళనాడు రాజకీయాల్లో మరో సంచలనానికి తెరలేసింది. జయలలితను అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకొచ్చారంటూ అపోలో వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో.. అది నిజం కాదంటూ నిరూపించేందుకు దినకరన్ వర్గం ఈ వీడియోను విడుదల చేసింది.

దినకరన్ మద్దతుదారుడు పి. వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. చెన్నైలో అపోలో ఆసుపత్రిలో జయలలిత చికిత్స పొందుతున్న సందర్బంలో ఆమెను ఎవ్వరూ చూడలేదని ప్రచారం జరిగింది. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సందర్బంలో వీడియోలు తీశామని ఇంత కాలం శశికళ నటరాజన్ వర్గం ప్రచారం చేసి అందరికీ షాక్ ఇచ్చింది. 

మరోవైపు ఆర్కే నగర్‌ ఉప ఎన్నికను వాయిదా వేయాలనే పిటిషన్‌ ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. గురువారం(రేపు) జరగనున్న ఉప ఎన్నిక పోలింగ్‌ను శాంతి భద్రతల నడుమ నిర్వహించాలని ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు జయలలిత ఒక్కరే జ్యూస్ తాగుతున్న వీడియో విడుదల చేసిన టీటీవీ దినకరన్ వర్గం ఉప ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి వేసిన మరో ఎత్తు అని అపోజీషన్ వర్గాలు ఆరోపిస్తున్నారు. 

ఒకవేళ ఈ వీడియో ఇంతకాలం గోప్యంగా ఎందుకు ఉంచినట్లు అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో గత ఏడాది సెప్టెంబర్ 25న రికార్డయినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన పలువురు ఇందులో ఉన్నది ‘అమ్మ’ జయలలితేనా? కాదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: