పాకిస్థాన్ ను ఖండ ఖండాలుగా నరకాలి - ముందుగా పాక్ పై యుద్ధం ప్రకటించాలి

రాక్షసులు తొలుత విజయం సాధిస్తారు. ఎందుకంటే వారి గొంతు పెద్దది. అరాచకాలు భయపెడతాయి. వారి భీబత్సానికి జనం జడుసు కుంటారు భయానికి లోనౌతారు భీతికి కంపరమెత్తుతారు. కాని ఒక్క సారి సాత్వికులు నిద్రలేస్తే భీబత్సం సముద్రం లోపలి బడబానలం లాగే లావా విరజిమ్ముతుంది.  అలాంటి వరద ఉదృతికి రాక్షస సామ్రాజ్యం అనంత కాలగర్భంలో కలవక తప్పదు. ఇదంతా ఎందుకంటే భారత్ తన అస్థిత్వం పరిరక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. "విజయమో!  వీరస్వర్గమో!" తేల్చుకోవలసిన అవసరమెంతో ఉందిప్పుడు.  


పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న కుల్‌భూషణ్‌ జాదవ్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన తల్లి, భార్యలకు జరిగిన అవమానంపై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. జాదవ్‌ను కలవడానికి వెళ్లిన ఆయన తల్లి అవంతి, భార్య చేతాన్ కుల్‌ల పట్ల పాకిస్తాన్‌ భద్రతా సిబ్బంది ప్రవర్తన అమానుషం మానవజాతి ప్రవర్తించాల్సిన తీరు కాదు. మనుష్యజాతి సిగ్గుపడవలసిన సంగతది. 


Divide Pak into four to curtail Terrorism n Divided it to Make Dhaka Falls: General GD Bakshi,Retd

వారి దుస్తుల్ని మార్పించి వేరే బట్టలు వేసుకోమనడం, మెడ లో ఉన్న మంగళ సూత్రాలను, గాజుల్ని తీయించడం, బొట్టు ఉండరాదనడం, బూట్లు తీయించడం, జాదవ్‌తో మాతృభాష లో సంభాషించడానికి తల్లి ప్రయత్నిస్తే అడ్డుకోవడం లాంటివి జనజాతికే విస్మయం కలిగించాయి. చివరకు జాదవ్‌ భార్య మంగళ సూత్రాలు, ఆమె బూట్లను పాకిస్తాన్‌ అధికారులు వెనక్కి ఇవ్వలేదు.


ఈ సంఘటనను మహాభారతంలో "ద్రౌపది వస్త్రాపహరణం" గా అభివర్ణించిన సుబ్రమణ్య స్వామి, జాదవ్‌ కుటుంబాన్ని అవమానించిన పాకిస్తాన్‌ గడ్డ ను ఖండ ఖండాలుగా తెగ నరకాలంటూ ఆగ్రహోధగృడై వ్యాఖ్యలు చేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టాలని కూడా సూచించారు.  అయితే, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. వాస్తవాధీన రేఖ అవల భారత సైన్యం నిర్వహించిన ఆపరేషన్‌ పై కూడా ఆయన మాట్లాడారు. ఆపరేషన్‌ విజయవంతం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. అయితే, పాకిస్తాన్‌కు ఇది సరిపోదని, దాన్ని నాలుగు ముక్కలుగా విభజించడమే రక్త దాహాన్ని ఆపగలుగుతుందని అభిప్రాయపడ్డారు.


భారత్‌ - పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే మరే ఇతర దేశం కూడా అందులో జోక్యం చేసుకోదని అన్నారు. ఇందుకు కారణం అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ పై ఉన్న అపవిత్ర ముద్రేనని చెప్పారు. పాకిస్థాన్‌పై యుద్ధం చేసి దానిని నాలుగు ముక్కలుగా విడగొట్టాల్సిందేనని బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు పరిశీలిం చటం అవసరమైతే అమలు చేయటం భారత్ కు ఎంతో అవసరం పాక్‌పై యుద్ధం ప్రకటించేందుకు ఇదే సరైన సమయమని, "సీరియస్ హోం వర్క్" ప్రారంభించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. అందుకు సంబంధించిన యుద్ధ ప్రణాళికను రచించాలి. హోంవర్క్ ఇప్పటి నుంచే మొదలు కావాల ని అభిప్రాయపడ్డారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయం  మాత్రమేనని పేర్కొన్నారు.


తాజాగా పాక్ భూభాగంలోకి చొరబడి ముగ్గురు పాక్ సైనికులను మట్టుబెట్టిన ఘటనపై స్వామి మాట్లాడుతూ "అది ఓకే. కానీ దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. అందుకు దానిని నాలుగు ముక్కలు చేయడమే సరైన పని" అని పేర్కొన్నారు. అలాగే పాకిస్థాన్ జాతీయులకు మెడికల్ వీసాలను జారీచేయడాన్ని భారత విదేశాంగశాఖమానుకుంటే మంచిదని స్వామి అభిప్రాయ పడ్డారు.

కొందరు ఈ వ్యాఖ్యలను వివాస్పధ వ్యఖ్యలనవచ్చు. అలాంటి వారిని భారత్ జన సామాన్యం క్షమించకూడదు. వివాదాస్పద పనులు చేసే పాకిస్థాన్ ను ఇప్పుడు క్షమిస్తే మనం మన అర్తర్జాతీయంగా గౌరవం పోగొట్టుకుంటాం. ఈ పనులు చేసిన అధికారు లను, చేయనిచ్చిన అధిపతులను మాత్రమే కాదు పాక్ అధ్యక్షుణ్ణి కూడా ఐఖ్యరాజ్య సమితికి పిలిచి సర్వసభ్యసభలో వారితో క్షమాపణ చెప్పించాలి ఈ అమానుషానికి సమాధానంగా!  లక్ష్మణుడు సైతం అవమానించినందుకు శూర్పణక ఆడది అని చూడ కుండా గుణపాఠంగా ముక్కుచెవులు కోసిపారేశాడు. ఇప్పుడీ ప్రపంచ శూర్పణక పాకిస్థాన్ కు 'ద్రౌపది వస్త్రాపహరణం'  కారణంగా తప్పనిసరిగా గుణపాఠం చెప్పాల్సిందే.  దీంతో మనదేశంలో రావణ కాష్ఠం లా రగులుతున్న కాశ్మిర్ సమస్య కూడా పరిష్కారమై దేశ దరిద్రం వదుల్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: