ఎడిటోరియల్: తమిళ మహాభారతం-రాజకీయాల్లో అన్నీ ఆత్మహత్యలే-హత్యలుండవు

ఒకరి అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి కాని, ఆ అనుభవమే మనకు కావాలను కుంటే చరిత్ర పునరావృత మౌతుంది. భారతీయ రాజకీయాల్లో దీనికి అనేక సంఘట్టనలు ఉదాహరణలుగా కనిపిస్తాయి. కొన్నిసార్లు అధికారంలో ఉన్న వారు రాజకీయకక్ష సాధింపుచర్యలకు పూనుకుంటే పరువు ప్రతిష్ఠ చివరకు అధికారం కోల్పోయే పరిస్థితులు ఏర్పడిన సంఘటనలకు ఉదాహరణలుగా "నాడు ఆంధ్రప్రదేశ్ లో సోనియా గాంధి నేడు తమిళనాట నరెంద్ర మోడీ"  నిర్వాకాలను పరిశీలిస్తే సరి.


రాజకీయాలు బహు విచిత్రం. పై నుండి చూసే వారికి వ్యూహ ప్రతివ్యూహాలుగా కనిపించినా అందులో మునిగిన వారికి దినదిన గండమే. అధికారం దక్కగానే  అప్పటి దాకా ఉన్న విజ్ఞత కోల్పోవటం అత్యంత సహజం. కొన్ని నిర్ణయాలు ఆత్మహత్యా సదృశం. ఒకే సందర్భంలో ఒకే రకంగా తప్పు చేసిన వాళ్ళు, పొందిన ఫలితాలు ఎదురుగా ప్రస్పుటంగా కనిపిస్తున్నా, ఎలాంటి ఫలితం అనుభవించారో తెలిసినా, అదే సందర్భంలో వివెకంతో వెరేగా స్పందించ కుండా పాత తప్పు మళ్ళీ చేసి పప్పులో కాలే శారు తమిళ రాజకీయాల్లో నరెంద్ర మోడీ -అమిత్ షాల ద్వయం.


గతంలో యుపిఏ అధికారంలో ఉండగా సోనియా గాంధి ఏవిధంగా స్పందించి తప్పులో కాలేసిందో, ఇప్పుడు ఎన్ డి ఏ అధికారంలో ఉండగా నరెంద్ర మోది కూడా అదే తప్పులో కాలేశారు. అప్పుడు సోనియా గాంధి జగన్ విషయంలో తప్పే, ఇప్పుడు నరెంద్ర మోది శశికళ విషయంలో చేశారు. నేఱగాళ్లను వారి దారికి వారిని వదిలేస్తే ప్రజలే వారిని చూసుకుంటారు. కాని వారు నేఱస్తులు కదా! అధికారంలో ఉన్నవాళ్ళు మనం ఏమైనా చెయ్యొచ్చని అష్టదిగ్భంధనం చేస్తే ప్రజలు అయ్యో! పాపం ! అనుకుంటే మన "ఖేల్ ఖతం ఖచ్చితంగా దుకాన్ బంద్!" అవుతుంది.


రాజకీయాల్లో ఇప్పటికే రాటుదేలిన 'ఆధునిక అమాత్య చాణక్య-రాక్షసులు' అనదగ్గ మోదీ-షా నిజంగా చెప్పాలంటే ధారుణ పరాభవం రుచి చూశారనే చెప్పొచ్చు.


గతంలో సోనియా గాంధి అసహాయతను ఆసరాగా చేసుకున్న వైఎస్ ఆమెను రాజకీయ చదరంగమే ఆడించారు. అది పరొక్షంగా ఇద్దరి మద్య వైరం కక్షగా మారింది. సోనియా అదను కోసం వేచి చూశారు. కాని ఆమెకు ఆ అవకాశం వైఎస్ జీవిత కాలంలో ఇవ్వలేదు సరికదా! రాష్ట్రంలో కాంగ్రెస్ రాజకీయాలను ‘తానాడిందే  ఆట తాను పాడిందే పాట’ గా ప్రతిపక్షాన్ని సైతం కనుచూపు మేరలోకి రానంతగా ప్రక్కకు తోసేసి సాధించారు. అందుకు పగబట్తిన సోనియా గాంధి తనకున్న వ్యక్తిగత వైరాన్ని, ఆయన మరణానంతరం ఆయన కుటుంబం మీద తీర్చుకోవాలనుకుంది.


ఈ విషయం తెలిసిన వైఎస్ తనయుడు జగన్మోహన రెడ్డి చాలా పకడ్బంధిగా ఒక ఏడాది సమయం తీసుకుని తన ఖాతాలన్నీ సర్ధుకొని సోనియా ని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధం అయ్యారు. "ఓదార్పు యాత్ర" అనే బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నారు. దాన్ని కాని సోనియా గాంధి అంగీకరించలేదు అన్నది ఒక మిష లేదా సాకు మాత్రమే. జగన్ తన రాజెకీయ ఆర్ధిక మనుగడ కోసం సోనియా గాంధిని ధీటుగా ఎదిరించారు.


జగన్మోహన్ రెడ్డిపై కావలసినన్ని అస్ట్ర శస్త్ర ప్రయొగాలు చేసి ఆయన్ని అష్టదిగ్భనదనం చేసి పాతాళంలోకి తొక్కేసేందుకు "శంకరరావు" అనబడే ఒక రాజకీయ శలభం తో హైకోర్టు లో పిర్యాదు చేయించటం తద్వారా అది సిబిఐ విచారణకు దారి తీసేలా చేయించడం ఆ తరవాత ఆ సి బి ఐ ఆద్వర్యంలో జరిగిన నాటకంలో ప్రభుత్వ పాత్ర ఏపి రాజకీయ యవనికపై జనం సినిమాలా చూసినదంతా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ వేడిలో భావోద్వేగాల మద్య జరిగిన జరిగిన కడప లోక్-సభ ఉప ఎన్నిక లో జగన్మోహన్ రెడ్ది దేశంలోనే అంతవరకు జరిగిన ఎన్నికల్లో కెల్ల అత్యంత అద్భుత ఆధిఖ్యతతో  గెలిచారు.


ఇదంతా అపర రాజకీయ చాణక్యులు మోడీ-షా కు తిలియంది కాదు. అయినా అదే ప్రయోగం తమిళనాట చేస్తే అదే చరిత్ర అక్కడ పునరావృతమైంది. నాడు తొలుత సోనియా చేసిన ప్రొయోగం వికటించినదని తెలినా ఇప్పుడు అదే విఫల ప్రయోగం తమిళనాడులో చేసిన నరెంద్ర మోది అదే వైఫల్య ఫలితాన్ని "నాటే పెన్ని మోర్-నాటే పెన్ని లెస్"గా పొందారు.


మోది కి శశికళ పై తొలినుంచి సదభిప్రాయం లేదు, మోదీ జయలలితపై శశికళ చేసిన రాజకీయ ఆర్ధిక వ్యక్తిగత దురాగతాల న్నీ నాడే జయలలితకు వివరించారని ఒక ప్రచారం ఉండేది. జయలలిత జీవించి ఉన్నంతవరకు తమిళనాట అడుగుపెట్ట లేమని తలచి జయలలిత స్నెహాన్ని వాంచించిన నమో ఆమె మరణానంతరం పెద్ద దిక్కులేని  ఏఐడిఎంకె కుటుంబానికి తానే అగ్రజుడు అవ్వాలనుకొని నాడు చేసిన రాజకీయ వ్యూహం బెడిసికొట్టింది. రాష్ట్ర గవర్నర్ ఆద్వర్యంలో జరిపిన వ్యూహాలు బెడిశాయి. "ఓపిఎస్-ఈపిఎస్" రాజకీయమూ వైఫల్యం చెందాయి. ఇన్-కం-టాక్స్ దాడులు ఆపై సి బి ఐ & ఈ డి ప్రయోగం శరవేగంగా జరిగిపోవటం 'సేం టు సేం' సోనియా రాజకీయమే స్క్రీన్ పై కనపడింది. 

 

అయితే దీనికి నేపధ్యం అంత బలహీనం కాదు అక్కడ శశికళది దుర్మార్గమైనా ఆమె జీవితలక్ష్యం దాగుంది. ఆమే జయలలిత రాజకీయ జీవితమే కాదు ఆర్ధిక సామాజిక సాంఘిక సాంస్కృతిక ఏదైనా అనండి ఆమె ఆత్మనే కబ్జా చేసేసింది. అయితే శశికళకి జయ లలిత ఆరోగ్యం ఎంత విచ్చిన్నమైందో జీవితం ఎంత పతనావస్థలో ఉందో అతి సాన్నిహిత్యంలో ఉన్న శశి కి తెలియని విషయం కాదు. ఆరోగ్యం గురించి అందరికన్నా ముందే తెలుసు, అందుకే జయలలిత ఆసుపత్రిలో ఉండగానే పార్టీని శశికళ సొంతం చేసుకునేందుకు అద్భుతమైన ప్రణాళిక  వేసారు.


జయలలిత పాలిటి భరతుడైన  పన్నీర్ సెల్వంను కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా ఉంచి, తర్వాత తానే ముఖ్యమంత్రి పదవి దక్కించుకునేందుకు పావులు కదిపారు. ఇది అంతాగమనించి ప్రతివ్యూహం పన్నటానికి బాజపా సిద్ధం అయ్యే తరుణంలో కలసివచ్చిన అదృష్ఠంలాగా  జయ అక్రమ ఆస్తుల కేసులో తీర్పు రావడం, ఆ తీర్పు వచ్చే దాకా గవర్నర్ శశికళను ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపడం, ఆమెని జైలుకి పంపడం, శశికళ ఆస్తుల మీద దాడులు చేయడం, ఇలా ఒకటేమిటి శశికళ ను అష్టదిగ్బంధనం చేసేసారు.


అయితే ఇదంతా తెరపైన మనందరికీ కనిపించిన కథ అయితే - తమిళప్రజల హృదయాల్లో అమ్మ స్థానం లోకి శశికళ రావటం ఇష్టం లేకపోయినా - తమజాతిపై ఉత్తరాది ఆధిపత్యాన్ని సహించని తమిళప్రజ అంతా అర్ధం చేసుకున్నారు. వారికి రాజకీయ పరిఙ్జానం ఆత్మాభిమానం భాష ప్రాంత అభిమానం చాల ఎక్కువ.  అయితే, ఇదంతా ఢిల్లీ పెద్దలు, ఒక మహిళ మీద చేస్తున్న దాడిగా తమిళ ప్రజలు భావించారు.


ఇక తాజాగా మోది డిఎంకె అధినేత కరుణానిధిని కలవడం కూడా తమిళ ప్రజలకి తప్పు సంకేతాలు పంపింది. మోది, కరుణా నిధి, పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు వారి దృష్టిలో దుష్ఠ చతుష్టయమే అయ్యారు. అందరూ  ఒక్కటై జైలులో ఉన్న మహిళ మీద చేస్తున్న కుట్రగా తమిళ ప్రజభావించారు. మధ్యలో దినకరన్ మీద గుర్తు కోసం లంచం ఇచ్చిన కేసు, ఒకసారి పోలింగ్ రద్దు చేయించడం.ఇలా కేంద్రం చేసిన అనేకతప్పులు కలిసి శశికళమీద సానుభూతి పెంచాయి, బిజెపిమీద కోపంపెంచాయి.


దాని పర్యవసానమే అప్పుడు జగన్ కడపలో గెలిచినట్లు ఇప్పుడు దినకరన్ కూడా ఆర్కేనగర్ లో భారీ మెజారిటీతో గెలిచారు. మనలో మనం తరవాత తన్ను కుందాం ముందు బయటనుండి దండెత్తు కొచ్చే శతృవుని అడ్డుకుందాం అనేలా, వచ్చేలా గుణపాఠం ఎన్నికల్లో చెప్పేశారు.  బిజెపికి అత్యంత అవమానకరంగా “నోటా కన్నా తక్కువ ఓట్లు” వచ్చాయి.అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెదేపా  కడపలో మూడో స్థానానికి పరిమితం అయితే, ఇప్పుడు తమిళనాడులో ప్రతిపక్షంలో ఉన్న డిఎంకె మూడో స్థానానికి పరిమితం అయింది.


శశికళని జైల్లో వేయడంలో తప్పు కాదు, కానీ దానికి అనుసరించిన పధ్ధతి, అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేయడం ఇవన్నీ జనం దృష్టిలో శశికళ చేసిన అవినీతి కన్నా పెద్ద తప్పులుగా కనిపించాయి. ఇక తమిళనాడు లో బిజెపి కి ఆఖరి ఆశ రజనీకాంత్. కానీ తమిళనాడు రాజకీయాలు చూస్తే రజనీ కన్నా, కమల్ హసన్ కి ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తమిళనాడు లో బిజెపి కి వ్రతం చెడ్డా ఫలం దక్కని పరిస్థితి.

 

ఇక్కడ చెప్పొచ్చెదేమంటే ఒక దుర్మార్గురాలి ధౌష్ట్యాన్ని ఎదుర్కోవటానికి కూడా సరైన పద్ధతి అవలంభించాలి. అదీ కడవరకు ఓపిక నిరీక్షణ చాలా అవసరం. ఎలా ఉండాలంటే నందవంశ నిర్మూలనకు చాణక్యుడు అవలంభించినంత ప్రయత్నం అవసరం. అది నాడు సోనియా కు గాని నేడు మోడీకి గాని లేదు. కాని అదే చాలా అవసరం. మోడీ ఖర్మేమంటే తమిళనాట దెబ్బ లైఫ్ -టైం లో ఆయన్ని దక్షిణ భారతం లో అడుగుపెట్టలేని పరిస్థితి అదీ ఒక నేఱస్థురాలు కారాగారవాసం చేసే శశికల చేతితో చెప్పుదెబ్బ కొట్టించుకున్నంత అవమానంతో.


సోనియా ఏపిలోని వైఫల్య అనుభవసారాన్ని కాచి వడపోసి మోడి వ్యూహం పన్నిఉంటే ఆ వెల్లువలో శశకళ కొట్టుకుపోయి ఉండేది. కాని మోడీనే శశికలని కథానాయకిని చేశారు. దట్సిట్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: