ఉస్మానియా విశ్వవిద్యాలయంపై టీఆర్ఎస్ అధినేత ప్రతీకారం

తెలంగాణా రాష్ర ప్రభుత్వ అసమర్ధత, చొరవ లేమి వలన అంతర్గత వ్యతిరేఖత వలన ప్రతిష్టాత్మక "ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌" సమావేశాలను ముందుగా నిర్ణయించిన విధంగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) లో నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వడంతో పాటు, ఈ సమావేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించా లని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది.


ఈ సమావేశాలకు అవసరమైన మౌలికసదుపాయాల కల్పన, నిధులు విడుదలచేయడంలో విఫలమైన రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇచ్చింద ని, దీనివల్ల ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు మరో చోటుకు తరలి పోయాయంటూ పీహెచ్‌డీ విద్యార్థులు కిరణ్‌కుమార్, విజయకుమార్‌లు హైకోర్టులో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఓయూ వైస్ చాన్సులర్  డీజీపీ, నగర పోలీస్‌ కమిషనర్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు.


రూ.50 కోట్లు వెచ్చించి ఓయూలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలకు యూనివర్సిటీ అన్ని ఏర్పాట్లు చేసిందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్ల ఆ డబ్బు, శ్రమ, విద్యార్థుల ప్రయోజనాలు అన్నీ బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయని పిటిషన ర్లు తెలిపారు. ప్రభుత్వ వ్యవహారశైలితో యూనివర్సిటీ ప్రతిష్ట కూడా దెబ్బతిన్నదని వివరించారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులపై చర్చించేందుకు గత 70 సంవత్సరాలుగా ప్రతి ఏడాదీ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశాలు నిర్వ హించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.


షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 3 నుంచి 7 వరకు ఓయూలో జరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు దాదాపు 13వేల మంది శాస్త్రవేత్తలు రిజిష్టర్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ సమావేశాలవల్ల యూనివర్సిటీకి దాదాపు రూ.300 కోట్లమేర ఆర్థిక ప్రయోజనం ఉండేదని, ప్రభుత్వ తీరు వల్ల ఈ గొప్ప అవకాశం చేజారిపోయిందని పిటిషనర్లు వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఉస్మా నియా విశ్వవిధ్యాలయమంటే టీరెస్ అధినేతకు భయపని, వ్యతిరేఖమని, అందుకే ఆయన యూనివర్సిటి ప్రతిష్ఠ మసక బారుస్తునారని ఓయు విధ్యర్ధుల్లో విశేషంగా వినిపిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: