ప్రపంచం చాలా విశాలమైంది అందులో అమెరికా ఎంత? పాకిస్తాన్ దురహంకార వ్యాఖ్యలు

దాయాది దేశం పాక్ కు ఇంకా కనువిప్పు కలగటం లేదు. ఒకవైపు కాశ్మీర్ ను రావణ కాష్టం చేస్తూ, మన దేశం లోపల ఉగ్రవాద పర్వం కొనసాగిస్తూ, అమెరికా అందించిన ఆర్ధిక సాయాన్ని భారత్ కు వెలుపల నుండి కూడా తీవ్రవాధ సరిహద్దు సమస్యలు సృష్టిస్తూ చతుర్ముఖ పోరు కొనసాగిస్తుంది. 

అయితే దశాబ్ధాల కాలం అమెరికా ఆర్ధిక సహాయంతో బ్రతుకీడ్చిన పాకిస్థాన్‌కు సైనిక, ఆర్థిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా అమెరికా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తాము ఉగ్రవాద సంస్థలపై చర్యలకు నిధులు అంద జేస్తుంటే, వాటిని వారిని పెంచి పోషించడానికే పాకిస్థాన్‌ వినియోగిస్తోందని, గత 15 ఏళ్ల నుంచి 33 బిలియన్ డాలర్ల (సుమారు గా 217800 కోట్ల రూపాయిలు) చేసిన సాయాన్ని దుర్వనియోగం చేసి తమను మోసగించిందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు.


ప్రస్తుతం పాకిస్తాన్ కు అందజేయాల్సి ఉన్న 1.15 బిలియన్ డాలర్ల సాయాన్ని నిలిపివేశారు. వారి భూభాగం లోని తాలిబన్, హక్కానీ గ్రూప్ లాంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్థాన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ దీన్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దీనికంతటికీ భారత్ మాత్రమే కారణమంటూ పాకిస్థాన్ ఆరోపణలు చేయడం గమనార్హం. దానికి ఋజువుగా డొనాల్డ్ ట్రంప్ మాటలను ఉటంకిస్తూ వస్తుంది.  


భారత్ తమపై డొనాల్డ్ ట్రంప్‌కు నూరిపోసి, అర్ధసత్యాలు, అసత్యాలతో వంచించిందని పాక్ విదేశాంగ మంత్రి ఖవాజా అసిఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను బుట్ట లోకి వేసుకుని అమెరికాకు దగ్గరైన భారత్, తమపై అసత్య ప్రచారం చేసిందని అసిఫ్ పదే పదే విమర్శించాడు. భారత్ మాటలు అమెరికా అధ్యక్షుని నోట నుంచి వెలువడ్డాయని వ్యాఖ్యానించాడు. జియో టీవీకి గత వారం ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ, "భారత్‌తో అమెరికా కుమ్మక్కైందని, వారి అభిప్రాయాలను ఈ ప్రాంతంలో రుద్దడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు"


జాతీయ భద్రత కమిటీ సమావేశంలోనూ అసిఫ్ ఈ వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్ తమను వంచించి, మోసం చేసిందని కొత్త ఏడాది తొలి రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో పాక్ అధికారులు చర్చించారు.


అమెరికా సాయం లేకుండా పాకిస్థాన్ మనుగడ సాగించగలదా? అన్న ప్రశ్నకు అవునని సమాధానం ఇచ్చిన అసిఫ్, ప్రపంచం చాలా విశాలమైందని, అగ్రరాజ్యం తమను పెంచి  పోషించడం లేదని అన్నారు. అంతే కాదు తీవ్రవాదంపై పోరులో అమెరికా తిరిగి మాకే 9 బిలియన్ డాలర్లు బాకీ పడిపోయిందని పేర్కొన్నారు. ఎందు కంటే తమ వైమానిక స్థావరాలను అమెరికా ఉచితంగా వినియోగించుకుంది.


గత పాలకులు తమ దేశాన్నితాకట్టు పెట్టారని,  9/ 11న్యూయార్క్ ఉగ్రదాడి తర్వాత సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ వారికి దాసోహం అయ్యారని మండిపడ్డారు. మా వైమానికి స్థావరాలను అమెరికాకు ఇవ్వడంతో దేశంలోని రహదార్లు సర్వ నాశనమ య్యాయి, దీనిపై ఆడిటింగ్ విధానంలో విచారణ చేస్తే ప్రతి పైసా వారు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: