తెలంగాణ ప్రజలకు సంక్రాంతి కానుక..!

Edari Rama Krishna
తెలంగాణ ఎన్నో సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం..ఇక్కడ ప్రజల నీరు, ఉద్యోగం,స్వతంత్రం కోసం పోరాడి ఎందరో త్యాగధనుల త్యాగ ఫలితం తెలంగాణ రాష్ట్రం.  ఇక తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చారు...ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.  మొత్తానికి కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.  ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. 

తెలంగాణ ప్రజల ఇష్టాలు, కష్టాలు తెలిసిన పార్టీ కనుక ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రజల కోసం ఎన్నో అభివృద్ది పనులు చేస్తూ ముందుకు వెళ్తున్నారు.  ముఖ్యంగా మిషన్ భగీరధ, స్వచ్ఛ హైదరాబాద్, డబుల్ బెడ్ రూమ్ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ అయ్యారు. అంతే కాదు పేద ప్రజలకు పెన్షన్లు, ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పేరిట, గత నాలుగేళ్లుగా  పేదవారి ఇళ్లల్లో జరిగే అమ్మాయిల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్‌ పేరిట, గత నాలుగేళ్లుగా అమలవుతున్న పథకంలో భాగంగా, ఎస్సీ, ఎస్టీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన ఆడ పిల్లలకు పెళ్లి కానుకగా రూ. 75,116 అందిస్తుండగా, దాన్ని రూ. 1,00,116కు పెంచాలని సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

తదుపరి బడ్జెట్‌లో పథకం అమలుకు కావాల్సినన్ని నిధులు కేటాయించాలని ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.  మొత్తానికి తెలంగాణ ప్రజలకు ఈ వార్త సంక్రాంతి కానుక అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: