పవన్, కత్తి మద్యలో చిరంజీవి..ఎంటా సంగతి..!

Edari Rama Krishna
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాన్, సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ న్యూస్ లే హల్ చల్ చేస్తున్నాయి.  గత నాలుగు నెలల క్రితం కత్తి మహేష్ తన ఫేస్ బుక్ లో పవన్ కళ్యాన్ గురించి అనుచితంగా పోస్ట్ చేశారని పవన్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు.  దీంతో కత్తి మహేష్ ని టార్గెట్ చేసుకొని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ..ఫోన్లు చేస్తూ హంగామా చేశారు.  దీంతో కత్తి మహేష్ తన గోడు పలు టీవి ఛానెల్స్ లో విన్నివించుకున్నారు. అప్పటి నుంచి కత్తి మహేష్ ఏ చిన్న చాన్స్ దొరికినా..పవన్ కళ్యాన్ పై ఎదో ఒక కామెంట్ చేయడం..ఫ్యాన్స్ గొడవ చేయడం జరుగుతుంది. 

తాజాగా నటుడు పవన్ కల్యాణ్, సినీ విమర్శకుడు కత్తి మహేష్  మధ్య వివాదం ఇంకెంత కాలం సాగుతుంది? ఈ వివాదానికి తక్షణం ముగింపు పలకాలని తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి కోరుతున్నారు. వీరిద్దరి మధ్య వివాదానికి తెరపడాలంటే ఈ వ్యవహారంలో చిరంజీవి జోక్యం చేసుకోవాలని ఆయన సూచించారు. 

గతంలో మీపై సినీ నటుడు రాజశేఖర్ వ్యాఖ్యలు చేస్తే, అందుకు నిరసన గా మీ అభిమానులు ఆయనపై దాడి చేశారు.,మీరు స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి ఆయనను పరామర్సించి ఒక మంచి సంప్రదాయానికి నిదర్శనంగా నిలిచారు అని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. అలా వివాదాన్ని పరిష్కరించారని ఆయన అన్నారు. కత్తి మహేష్ -  పవన్ కల్యాణ్ అభిమానుల గొడవల కారణంగా ప్రజల్లో మీ కుటుంబం పట్ల ఉన్న గౌరవం సన్నగిల్లుతుందని, గోరుతో పొయ్యేదాన్ని గొడ్డలి వరకు తీసుకురావడం సమంజసం కాదని, మిమ్మల్ని అభిమానించే వారందరికీ బాధ కలిగిస్తుందని చెప్పారు.

గుణగణాల ద్వారా పవన్ కల్యాణ్ ఎవరికీ తలవంచరని, గతంలో ప్రజారాజ్యం పార్టీ యువనేతగా పవన్ కల్యాణ్ కాంగ్రెస్ వారిని పంచలు విప్పాలని అన్నారని కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గుర్తు చేశారు..పవన్ కల్యాణ్ నిజాయితీ పరుడని, నిజాయితీ ఉన్నవాడికి ఆవేశం ఎప్పుడు ఉంటుందని,  తాము చేప్పాలనుకున్న మాటలను నిక్కచ్చిగా చెప్పడానికి సంకోచించరని ఆనయ అన్నారు. 

పవన్ కల్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ఎర్పాటు చేసిన జనసేన పార్టీ లక్యం నచ్చితే జనం తప్పకుండా ఆదరిస్తారని అన్నారు.  అయితే  కత్తి మహేష్ వ్యవహారం భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులకు దారి తీయక ముందే చిరంజీవి జోక్యం చేసుకొని ఆ సమస్య భవిష్యత్ లో పునరావృతం కాకుండా చూడాలని కేతిరెడ్డి కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: