హెలికాప్టర్‌ ప్రమాదం..ముగ్గురు మృతి..!

Edari Rama Krishna
ఓఎన్‌జీసీ(ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌) ఉద్యోగులతో ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ శనివారం ఉదయం అదృశ్యమైంది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో నలుగురి ఆచూకీ లభ్యం కాలేదు. కాగా, శనివారం ఉదయం 10గం.30ని. సమయంలో జుహూ వద్ద నుంచి పవన్‌ హన్స్‌ (వీటీవీడబ్యూఏ దౌఫిన్‌ ఏఎస్‌ 365 ఎన్‌3) హెలికాప్టర్‌ ఇద్దరు పైలట్‌లు, ఐదుగురు సిబ్బందితో బయలుదేరింది. 

టేకాఫ్‌ అయిన హెలికాప్టర్‌ షెడ్యూల్‌ ప్రకారం 10.58గంటలకు గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంది. కానీ 10.30గం. సమయంలో హెలికాప్టర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీఎస్‌)తో సంబంధాలు తెగిపోయింది. ఇందులో ఐదుగురు ఓఎన్‌జీసీ ఉద్యోగులు, ఇద్దరు పైలట్లు ఉన్నారు.ముంబై హై నార్త్‌ ఫీల్డ్‌కు అది చేరాల్సి ఉండగా.. అకస్మాత్తుగా ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)తో సంబంధాలు కోల్పోయింది.

ఎంత ప్రయత్నించినా కమ్యూనికేషన్‌ దొరకపోవటంతో ఆందోళన నెలకొంది. చివరకు అధికారులు హెలికాఫ్టర్‌ ప్రమాదానికి గురైనట్లు ప్రకటించారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.  గల్లంతైన చాపర్‌ కోసం.. నౌకాదళం కూడా రంగంలోకి దిగింది. ప్రస్తుతం నాలుగు హెలికాప్టర్లు, ఓ యుద్ధనౌకతో గాలింపు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: