రాంగోపాల్ వర్మపై దేవి ఫైర్..!

Edari Rama Krishna
ప్రముఖ దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ జనవరి 26న రిలీజ్ చేయబోతున్న గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ వీడియో సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. మియా మల్కోవా నటించిన వీడియోపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఓ ఛానల్ రామ్ గోపాల్ వర్మ, కత్తి మహేశ్, కొంతమంది యువతులతో లైవ్ కార్యక్రమం నిర్వహించారు. సినిమా వ‌ల్ల శృంగారంపై ఉన్న అపోహ‌లు చెరిగిపోతాయ‌నేలా వ‌ర్మ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పైన, ఆ సినిమాపైన సామాజిక కార్యకర్త దేవి మండిప‌డ్డారు. 

తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'మ‌నిషి జంతువు కాదు.. జంతువు స్థాయి నుంచి దాటి వ‌చ్చాడు కాబ‌ట్టే కొన్ని గోప్య‌తలు అవ‌స‌రం అయ్యాయి. మ‌నుషుల స్థాయిలో ఉండ‌ద‌లుచుకోలేదంటూ, ఇలాగే చూపించ‌ద‌లుచుకున్నామంటూ ఇటువంటి సినిమాలు తీసి నాగ‌రిక స‌మాజంలో బ‌తుకుతోన్న వారిపై వ‌దులుతారా? మీ జంతు లోకంలోకి ఈ నాగ‌రిక స‌మాజం రావాల‌నుకోవ‌డం లేదు. ఇలాంటి సినిమాలు నేటి యువతపై ఎలాంటి చెడు ప్రభావాన్ని చూపిస్తున్నాయో రోజు కొన్ని వందల సంఘటనలు రుజువు చేస్తున్నాయి. 

ఒక సినిమా దర్శకుడిగా ఆ మాత్రం మీరు అర్థం చేసుకోగలరు..అలాంటిది సమాజాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఇలాంటి తెరకెక్కించడం ఎంత వరకు సమంజసం అని ఆమె ప్రశ్నించారు.  ఇది బూతు సినిమా కాద‌ని అంటున్నారు. ఇటువంటి సినిమాలు, వీడియోలు శారీర‌క ప్ర‌క్రియ‌లో క్రూర‌త్వాన్ని చూపుతాయి.

పోర్నోగ్ర‌ఫీ ఎటువంటి దారుణాల‌కు దారి తీస్తుందో తెలుసుకుని మాట్లాడాలి. స‌మాజంలో సెక్స్‌పై ఉన్న చెడు భావాల‌ను, చాద‌స్తాన్ని పోగొట్ట‌డానికే ఇటువంటి వీడియోలు, సినిమాలు అని అంటున్నారు.  ప్ర‌పంచంలో ఇటువంటి (రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి) పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు' అని దేవి పేర్కొన్నారు. రామ్ గోపాల్ వ‌ర్మ తీస్తోన్న సినిమాను ఖండించారు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: