వారిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన నటి జయప్రద..!

Edari Rama Krishna
ఈ మద్య తమిళనాట రాజకీయాల్లో ఎన్నో సంచలన మార్పులు సంబవిస్తున్నాయి.  దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె రాజకీయ వారసులం మేమే అంటూ పన్నీరు సెల్వం - శశికళ మద్య జరిగిన యుద్దం గురించి అందరికీ తెలుసు.  కాకపోతే..శశికళ అక్రమాస్తుల కేసులో నాలుగు సంవత్సరాలు జైలు పాలు కావడంతో కొత్త ఎత్తుగడ వేసింది. ఆమె స్థానంలో చిన్నమ్మకు ఎంతో నమ్మకస్తుడైన పళని స్వామిని సీఎంగా చేసింది.  అయితే రాజకీయాల్లో ఎవరూ శాశ్వత మిత్రులు కారు..ఎవరూ శాశ్వత శత్రువులు కాదు అన్న చందంగా పళని స్వామి పదవిలోకి వచ్చాక..చిన్నమ్మకు రివర్స్ అయ్యారు..ఆమె శత్రువైన పన్నీరు సెల్వంతో కలిసిపోయారు. 

ఇదిలా ఉంటే..ఈ మద్య ఆర్కేనగర్ ఎన్నికల్లో శశికళ బంధువు దినకరన్ అనూహ్యంగా గెలుపు కైవసం చేసుకున్నారు.  ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో స్టార్ హీరోల సందడి కనిపించబోతుంది. సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటుడు కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు తెలిపారు.  ఈ మేరకు పలు మీటింగులు ఏర్పాటు చేసి తమిళ తంబీల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.  తాజాగా వీరి రాజకీయ ప్రవేశంపై ప్రముఖ అందాల తార మాజీ ఎంపీ జయప్రద సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాలు అంటే పూలబాట కాదు. ముళ్లు, రాళ్లు దారిలో పరచి ఉంటాయి..వాటన్నింటిని చూసుకుని నడిస్తేనే గమ్యం చేరుకోగలరు. సినిమా రంగం నుండి వస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాలను, సినిమాలను వేర్వేరుగా చూడాలి. రాజకీయాలంటే రెండున్నర గంటల సినిమా కాదనే విషయం తెలుసుకోవాలి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నడవాలి...’’ అంటూ రజినీకాంత్, కమల్ హాసన్‌లకు ఆమె సూచనలిచ్చారు.


గత కొంత కాలంగా తమిళనాడులో రాజకీయాలు గందరగోళంగా మారాయని..ప్రతిరోజూ తమిళనాట రాజకీయాల్లో ఏదో ఒక సంక్షోభం జరుగుతుందని అందరూ ఊహించడం సర్వ సాధారణం అయ్యిందని జయప్రద అన్నారు.  ఇక రజినీ, కమల్  రాజకీయ ప్రవేశాన్ని తాను స్వాగతిస్తున్నానని, జయలలిత మరణంతో తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను వీరు తొలగించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వీరిలో ఎవరు రాణిస్తారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని జయప్రద వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: