20 మంది ఎమ్మెల్యేలు అవుట్.. ‘ఆప్‌’ కి ఈసీ షాక్..!

siri Madhukar
ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.  శాసనసభ్యత్వంతోపాటు లాభదాయక పదవులను కలిగివున్న ఆరోపణలపై ఆమాద్మీ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం అనర్హత వేటు వేసింది.  దీంతో కేజ్రీవాల్ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని ఉహాగానాలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ రాజ్యాంగ ఉల్లంఘన కు పాలపడ్డారనేది ఈసీ అభియోగం. రాజ్యాంగ నిబంధనల్ని అతిక్రమించిన కేజ్రీవాల్ తన పార్టీలోని 20 మంది ఎమ్మెల్యే లకు ఉన్నత పదవులు కట్టబెట్టారని ఎన్నికల సంఘం ఆరోపించింది.

ఈ 20 మందిని శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించటంతో ఢిల్లీ శాసనసభకు ఉప ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఢిల్లీ శాసనసభకు 2015లో జరిగిన ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీ ఘన విజయం సాధించినప్పటి నుండి ఈ లాభదాయక పదవుల వివాదం కొనసాగుతోంది.  అప్పటి నుంచి  ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించి..వారికి కారు, కార్యాలయం, ఇతర వసతులు కల్పించాడు. తద్వారా వారందరికీ కేబినెట్‌ హోదా ఇచ్చినట్లయింది. పరిపాలనా సౌలభ్యానికే వీరిని పార్లమెంట్‌ కార్యదర్శులుగా నియమించినట్లు అప్పట్లో కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు.

పైగా వీరికి ఎటువంటి అదనంగా చెల్లింపులు చేయబోమని చెప్పారు.  కాకపోతే దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి ఆమోదించలేదు.  లాభదాయకమైన జోడు పదవులు అనుభవిస్తున్న కారణంగా ఈ 21 మందిని అనర్హులుగా ప్రకటించాలా వద్దా తేల్చాలని రాష్ట్రపతి ఎన్నికల సంఘాన్ని కోరారు. అయితే  నిబంధనల ప్రకారం ఢిల్లీ కేబినెట్ లో 7 గురు మంత్రులకు ఇంచి ఉండకూడదు. కానీ కేజ్రీవాల్ పరిపాలనా సౌలభ్యం కోసం అంటూ మరో 20 మంది ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా కల్పించారు.

కాగా, రాజ్యాంగ నిబంధనల్ని అతిక్రమించిన కేజ్రీవాల్ తన పార్టీలోని 20 మంది ఎమ్మెల్యే లకు ఉన్నత పదవులు కట్టబెట్టారని ఎన్నికల సంఘం ఆరోపించింది.  ఇప్పటికే ఆ 20 మంది ఎమ్మెల్యే లకు ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.  అంతే కాదు ఆ 20 మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం రాష్ట్రపతికి తాజాగా లేఖ పంపింది. రాష్ట్రపతి ఈ లేఖకు స్పందిస్తే కేజ్రీ సర్కారుకు రోజులు దగ్గర పడ్డట్లే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: